SS Thaman: అంతగా అంచనాలు పెట్టుకుంటే ఎలా బ్రో?

ABN , First Publish Date - 2023-07-11T12:00:53+05:30 IST

‘‘కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలి. అన్ని సినిమాల్లోనూ మాస్‌ పాటలను పెట్టలేం. ‘బ్రో ’ కథ అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించా. అది కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. అంతగా అంచనాలు పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?’’ అని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు.

SS Thaman: అంతగా అంచనాలు పెట్టుకుంటే ఎలా బ్రో?

‘‘కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలి. అన్ని సినిమాల్లోనూ మాస్‌ పాటలను పెట్టలేం. ‘బ్రో(Bro)’ కథ అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించా. అది కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. అంతగా అంచనాలు పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?’’ అని సంగీత దర్శకుడు తమన్‌ (SS Thaman) అన్నారు. తాజాగా ఆయన సంగీతం అందిస్తున్న చిత్రం ‘బ్రో’. పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) కీలక పాత్రధారులుగా పి.సముద్రఖని (P Samudrhrikani) దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తమన్‌ విలేకర్లతో మాట్లాడారు.

‘‘నేను చేస్తున్నది ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ కాదు. సంగీత దర్శకుడిగా సినిమా కోరుకున్న సంగీతాన్ని నేను సమకూర్చాలి. ‘బ్రో’ సినిమాకు అదే చేశా. మనసుల్ని కదిలించే ఓ మంచి చిత్రమిది. అందుకు తగ్గట్టుగానే సంగీతం అందిస్తున్నా. అన్ని సినిమాల్లోలాగా ఇందులో మాస్‌ పాటలు చేయలేం. మార్కండేయ పాటను ఒక ప్రొవెర్బ్‌ రూపంలోనే చెప్పాలి తప్ప ఐటెమ్‌ సాంగ్‌లా చేయలేం. కథ ఏం కోరుకుందో అదే ఇచ్చారు. ఎకడాఆ పరిధి దాటలేదు. ఇక ‘బ్రో’ సాంగ్‌ విడుదలయ్యాక స్పందన విషయానికొేస్త... కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఇవన్నీ భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు. మరీ ఇంతగా అంచనాలు పెట్టుకుంటే ఎలా? మంచి బీట్‌తో పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కుదరాలి కదా!

అభిమానిగా హ్యాపీ...

పవన్‌కల్యాణ్‌ సినిమాలకు సంగీతం అందించడంలో నాకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఒక అభిమానిగా ఆయనతో పని అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఫ్యాన్స్‌ నుంచే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఒత్తిళ్లు స్వీకరించడం బాగా అలవాటై పోయింది. ఈ 25 ఏళ్ల అనుభవం ఎంతో నేర్పింది. 2014లో 13 సినిమాలకి పనిచేశా. అప్పుడు అన్ని అలా కలిశాయంతే! ఈ ప్రయాణంలో ‘బ్రో’ సినిమాకి పనిచేయడం ఓ భిన్నమైన అనుభవం. కథను ముందుకు తీసుకెళ్లే పాటలు చేేస అవకాశం అరుదుగా దొరుకుతుంది. ఈ సినిమాతో ఆ అవకాశం దొరికింది. ఒక బలమైన సవాల్‌ ఎదురైతే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించినట్టే. పవన్‌కల్యాణ్‌తో చేసిన మూడు సినిమాలు రీమేక్‌లే. ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో మగువ మగువ... పాటతో మాసీగా ఫైట్లలోనూ వినిపించాం. ‘భీమ్లానాయక్‌’లో మాస్‌ పాటకి అవకాశం దొరికింది. ‘బ్రో’ కోసం మనసుల్ని కదిలించేలా సంగీతం ఇవ్వాల్సి వచ్చింది. ఇందులో హత్తుకునే సన్నివేశాలున్నాయి. త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అలా ఉంటాయి. దర్శకుడు సముద్రఖని నటించిన ఈ సినిమా మాతృకలో పాటలు ఉండవు. ఇటీవలే దర్శకనిర్మాతలు సినిమా చూసి ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. సంగీతం ఎంతో బావుంది అభినందించారు. ఓ దర్శకుడు అలా కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు.

Updated Date - 2023-07-11T12:00:53+05:30 IST