Srinu Vaitla : మా లక్ష్మి మరణించింది!

ABN , First Publish Date - 2023-09-14T12:17:36+05:30 IST

దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన ఫామ్‌హౌస్‌లోకి మొదటిసారిగా తెచ్చిన ఆవు మరణించింది. '13 ఏళ్లగా మా ఫామ్‌లో ఉంటున్న ఆవు మరణించడంతో కుటుంబ సభ్యుల హృదయాలు శోకసముద్రంలో నిండిపోయాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘

Srinu Vaitla : మా లక్ష్మి మరణించింది!

దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన ఫామ్‌హౌస్‌లోకి మొదటిసారిగా తెచ్చిన ఆవు మరణించింది. '13 ఏళ్లగా మా ఫామ్‌లో ఉంటున్న ఆవు మరణించడంతో కుటుంబ సభ్యుల హృదయాలు శోకసముద్రంలో నిండిపోయాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘నా ఫామ్‌లోకి మొదటిగా తెచ్చుకున్న ఆవు మరణించింది. 13 ఏళ్లగా తనని మేమంతా కుటుంబ సభ్యురాలిగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. నా కూతుళ్లు ఇద్దరిను ఎంతో ప్రేమతో మా ఆవుని లక్ష్మీ (Lakshmi) అని పిలుస్తారు. మా లక్ష్మీకి సాంప్రదాయంగా అంత్యక్రియలు చేసి వీడ్కోలు చెబుతాం’’ అని శ్రీనువైట్ల లక్ష్మీ ఫొటోను షేర్‌ చేశారు.

Cow lakshmi.jpeg

టాలీవుడ్‌కి కల్ట్‌ కామెడీ చిత్రాలు ఇచ్చిన ఆయన కొంతకాలంగా ఖాళీగా ఉన్నారు. ‘ఢీ2’ చిత్రం తెరకెక్కిస్తామని ప్రకటించినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఆయన ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల గోపీచంద్‌తో ఆయన ఓ సినిమా ప్రారంభించారు. చిత్రాలయం స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Updated Date - 2023-09-14T12:17:36+05:30 IST