Srikanth Injured : చిన్నదే అనుకుంటే.. పెద్దది అయింది!

ABN , First Publish Date - 2023-11-20T19:13:15+05:30 IST

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’ (Devara) పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ (Srikanth injured) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవల గోవాలో చిత్రీకరించారు.

Srikanth Injured : చిన్నదే అనుకుంటే.. పెద్దది అయింది!

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’ (Devara) పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ (Srikanth injured) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇటీవల గోవాలో చిత్రీకరించారు. పాటలతోపాటు సినిమాకు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ తనకు గాయమైనట్లు శ్రీకాంత్  తెలిపారు. తాజాగా ఆయన నటించిన ‘కోట బొమ్మాళి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్‌ షోకు అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ ‘‘దేవర’ షూటింగ్‌ సెట్‌కు ఇసుకలో నడుచుకుంటూ వెళ్తుంటే కాలు మడతపడడంతో కింద పడ్డాను. చిన్న గాయమే అనుకున్నా. కొంత సేపటికి  మోకాలు అంతా వాపు వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే  కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. కానీ, నేను షూటింగ్‌లో పాల్గొన్నా.. నిలబడే డైలాగులు చెప్పాను.  ఇప్పుడు ఈ షోకు కూడా ‘దేవర’ సెట్‌ నుంచే వచ్చాను’ అని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీకాంత్  అభిమానులు రెస్ట్‌ తీసుకోండి సర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తోన్న చిత్రం కావడం, కొరటాల శివ - తారక్  కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. విలనగా సైఫ్‌  అలీఖాన్  కనిపించనున్నారు. ప్రస్తుతం  హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు. 



మరిన్ని టాలీవుడ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Updated Date - 2023-11-21T14:20:34+05:30 IST