Srikanth - Raasi : గొళ్లున నవ్వింది... కొట్టేసింది..

ABN , First Publish Date - 2023-09-26T15:52:23+05:30 IST

హీరో శ్రీకాంత్‌ (Srikanth) ఏమన్నారో తెలీదు కానీ నటి రాశీ (Raasi)మాత్రం వేదికపై గొళ్లును నవ్వారు. నవ్వు ఆగలేని స్థితిలో ఆయన్ను సరదాగా కొట్టారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Srikanth - Raasi : గొళ్లున నవ్వింది... కొట్టేసింది..

హీరో శ్రీకాంత్‌ (Srikanth) ఏమన్నారో తెలీదు కానీ నటి రాశీ (Raasi)మాత్రం వేదికపై గొళ్లును నవ్వారు. నవ్వు ఆగలేని స్థితిలో ఆయన్ను సరదాగా కొట్టారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రుద్రం కోట’ సినిమా టీజర్‌ లాంచ్‌ వేదికపై ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకీ రాశీ అంతగా నవ్వడానికి కారణం ఏంటి? ఇద్దరూ పక్కపక్కనే నిల్చుని ఉన్నారు. సైలైంట్‌గా రాశీ పక్కనే ఉన్న శ్రీకాంత్‌ నోటికి చెయ్యు అడ్డు పెట్టుకుని ఏదో జోక్‌ వేశారు. దాంతో రాశీ ఒక్కసారిగా గొళ్లున నవ్వారు. స్టేజీ మీద హుందాగా ఉంటూనే నవ్వు కంట్రోల్‌ చేసుకోలేక శ్రీకాంత్‌ కూడా బిగ్గరగా నవ్వారు. రాశీకి నవ్వు ఆగక శ్రీకాంత్‌ వీపుపై రెండు దెబ్బలు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. శ్రీకాంత్‌ ఏమని పంచ్‌ వేశారా ? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం ‘చాలా రోజుల తర్వాత కలిస్తే ఇలా ఉంటుంది. ఏం మాట్లాడుకున్నారో కానీ చూడ ముచ్చటగా ఉంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి పండగ, దీవించండి, ప్రేయసి రావే, సుప్రభాతం, అమ్మో ఒకటో తారీఖు, సరదా సరదాగా, గిల్లికజ్జాలు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.

ఇదే వేదికపై రాశీ మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌ నేను మంచి స్నేహితులం. ఒకే ఏడాది మేమిద్దరం వేర్వేరుగా ఎనిమిది చిత్రాల్లో నటించాం. ఒకేసారి రెండు సినిమాల్లో నటించాం. ఆ ఏడాది అంత బిజీగా ఉన్నది మేమే అనుకుంటా’’ అని అన్నారు.

Updated Date - 2023-09-26T16:20:26+05:30 IST