Sonu sood: బీహార్‌లో అనాథ ఆశ్రమానికి అండగా..
ABN , First Publish Date - 2023-05-30T13:35:51+05:30 IST
కరోనా, లాక్‌డౌన్ సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు సోనూసూద్ (Sonu sood). వలస కార్మకులు, పేదలు , విదేశాల్లో ఉండిపోయిన ఎంతోమంది 'ఆపదలో ఉన్నాం' అని చిన్న సందేశం ఇవ్వడం చాలు ‘నేనున్నా’ అంటూ సహకారం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు.
కరోనా, లాక్‌డౌన్ సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు సోనూసూద్ (Sonu sood). వలస కార్మకులు, పేదలు , విదేశాల్లో ఉండిపోయిన ఎంతోమంది 'ఆపదలో ఉన్నాం' అని చిన్న సందేశం ఇవ్వడం చాలు ‘నేనున్నా’ అంటూ సహకారం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. తాజాగా సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనాథ పిల్లలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. బీహార్‌కు చెందిన ఓ యువకుడు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ స్కూల్ (International Child school)ప్రారంభించాడు. ఇప్పటికే అందులో 100 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. (International Orphan Home) ఆయనతో చర్చించిన తర్వాత.. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం అందించారు.
అంతేకాదు ఆ చిన్నారుల కోసం కొత్తగా స్కూల్ బిల్డింగ్‌ను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తానూ భాగమవుతానని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయన్ను మెచ్చుకుంటున్నారు. మరోసారి మీ గొప్ప మనసు చాటుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు మనుషుల్లో మహానుభావుడివని, సేవ కార్యక్రమాలకి మహారాజువని కామెంట్స్ చేస్తున్నారు.