SobhitaDhulipala: నాగ చైతన్యతో డేటింగ్... వున్నట్టా, లేనట్టా.. ఇంతకీ ఈ అమ్మడు ఏమంటోంది...

ABN , First Publish Date - 2023-06-01T17:59:34+05:30 IST

'పొన్నియిన్ సెల్వన్', 'ది నైట్ మేనేజర్' ఒకటి సినిమా, ఇంకోటి వెబ్ సిరీస్ ఈ రెండింటిలోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి శోభిత ధూళిపాళ. ఆమె నిన్న మే 31కి 31 సంవత్సరం లోకి అడుగుపెట్టింది. ఆమె, నాగ చైతన్య తో ఫోటోల్లో కనపడి వైరల్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడూ. ఆ విషయం గురించి ఆమె ఏమి చెప్పిందో తెలుసా...

SobhitaDhulipala: నాగ చైతన్యతో డేటింగ్... వున్నట్టా, లేనట్టా.. ఇంతకీ ఈ అమ్మడు ఏమంటోంది...
Sobhita Dhulipala

టాలీవుడ్ సూపర్ స్టార్ దివంగత కృష్ణ (SuperStarKrishna) పుట్టినరోజు మే 31 May 31, సాంఘీక మాధ్యమం అంతా అతని పేరు వైరల్ అవుతూ ఉంటే, ఇంకో నటి పుట్టినరోజు కూడా అదే రోజు. ఆమె మరెవరో కాదు శోభిత ధూళిపాళ (SobhitaDhulipala), నిన్న మే 31కి ఆమెకి కూడా 31 సంవత్సరాలు వచ్చేసాయి. ఆమె ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో అభిమానులు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె 'పొన్నియిన్ సెల్వన్' (PonniyinSelvan), 'ది నైట్ మేనేజర్' (TheNightManager), 'మేడ్ ఇన్ హెవెన్' (MadeInHeaven), 'రామన్ రాఘవ్ 2.0' (RamanRaghav 2.0), ఇటు ఫిలిమ్స్ లోనూ, అటు వెబ్ సిరీస్ లోనూ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను మెప్పించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

sobhitadhulipalanew8.jpg

అయితే ఒక పక్క మంచి నటిగా ఉంటూనే, మరో పక్క అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య (NagaChaitanya) తో డేటింగ్ లో వుంది అనే వార్తలు కూడా చాలా సార్లు వైరల్ అయ్యాయి. చైతన్యతో శోభిత కలిసి వున్న ఫోటోస్ వైరల్ అవటం, దానితో ఆమె అతనితో డేటింగ్ లో ఉందని వార్తలు రావటం ఇలా వైరల్ అయింది ఆమె పేరు. నాగ చైతన్య కూడా సమంత (Samantha) కి విడాకులు ఇచ్చేసిన తరువాత, శోభిత చెంతకు చేరాడంటూ వార్తలు వచ్చాయి.

ఈ డేటింగ్, రిలేషన్ షిప్ వార్తల మీద శోభిత తాజా స్పందించారు. అవన్నీ రూమర్స్ అయినప్పుడు, వాటితో తనకు సంబంధం లేనప్పుడు తాను ఎందుకు వాటి గురించి స్పందించాలి అని అంటోంది. తాను ఏ తప్పు చెయ్యలేదని, అందుకని దాని గురించి మాట్లాడాల్సిన పని లేదని చెప్పింది శోభిత. అందరూ దాని గురించే మాట్లాడుతుంటే, అది పట్టుకొని మధన పడాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పేసింది.

nagachaitanyashobita.jpg

అయితే ఎవరు ఎన్ని ప్రశ్నలు ఆ డేటింగ్ రూమర్ల గురించి అడిగినప్పుడు శోభిత ఆ ప్రశ్నకు సూటి సమాధానం ఇవ్వటం లేదు. "ఎవడో ఎదో తెలివితక్కువగా మాట్లాడితే నేనెందుకు సమాధానం చెప్పాలి. అదీ కాకుండా, నేను తప్పు చెయ్యనప్పుడు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు, అది నా పని కూడా కాదు," అని చెప్పింది శోభిత. కానీ ఆమె సమాధానాలు మాత్రం సూటిగా లేవు. నాగ చైతన్యతో తాను డేటింగ్ లో ఉందా, లేదా అనే సమాధానం మీద ఇవ్వన్నీ మాట్లాడటం ఎందుకు, ఉంటే వుంది, లేదంటే లేదు సమాధానం చెప్పకుండా ఇవన్నీ చెపుతోంది శోభిత. అయితే ఇద్దరూ ఈ రిలేషన్ షిప్ ని రహస్యంగా ఉంచి, తరువాత ఎప్పుడైనా అందరికీ చెప్పాలని అనుకున్నారేమో అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-06-01T17:59:34+05:30 IST