Siya goutham: రవితేజ హీరోయిన్ పెళ్లి!
ABN , First Publish Date - 2023-02-07T21:01:37+05:30 IST
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ (2008)సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శియ గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ వివాహం వైభవంగా జరిగింది.
రవితేజ (raviteja) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’(Neninthe) (2008)సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శియ గౌతమ్ (siya goutham Marriage with palkiwala)అలియాస్ అదితి గౌతమ్ వివాహం వైభవంగా జరిగింది. మిఖాయిల్ పాల్కివాలా అనే వ్యక్తితో ఆమె సోమవారం ఏడడుగులు వేశారు. ఆయన ముంబైకి చెందిన వ్యాపారవేత్త. హల్దీ ఫంక్షన్, సంగీత్లతోపాటు పెళ్లి సంగతులను వీడియోగా చిత్రీకరించి శియా సోషల్ మీడియలో షేర్ చేశారు. ఇటీవల ఆమె ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగిన పలు కార్యక్రమాల్లో స్టెప్పులేసి అలరించారు. మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే తన పెళ్లి విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు సర్ప్రైజ్గా ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో ఆమెను అభిమానించే వారంతా అవాక్కయ్యారు. నెట్టింట ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే పెళ్లి ఎక్కడ జరిగిందనే విషయాన్ని శియా (Neninthe fame)వెల్లడించలేదు.