Shruti Haasan: ఓపెన్‌ రొమాన్స్‌ ఏంటి.. సమాజానికి ఏం చెబుతున్నావ్

ABN , First Publish Date - 2023-03-12T20:30:53+05:30 IST

శ్రుతీహాసన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన ప్రియుడు శాంతాను హజారికతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తుంటారు.

Shruti Haasan: ఓపెన్‌ రొమాన్స్‌ ఏంటి.. సమాజానికి ఏం చెబుతున్నావ్

శ్రుతీహాసన్‌పై (Shruti haasan)నెటిజన్లు మండిపడుతున్నారు. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన ప్రియుడు శాంతాను హజారికతో (Santanu Hazarika) కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. అయితే తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియోతో ట్రోలింగ్‌కు గురయ్యారు శ్రుతీహాసన్‌. ఇలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్‌ అంటూ మండిపడుతున్నారు. (Shruti Haasan open romance with Santanu Hazarika)

శ్రుతీ షేర్‌ చేసిన వీడియోలో తన ప్రియుడు శాంతానాను ముద్దాడుతూ కనిపించింది. ‘శాంతాను ఇంటికి వచ్చేశాడు. అతను నా జీవితంలోకి వచ్చాక చాలా మారిపోయాను’’ అంటూ ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ ఆ వీడియోలో కనిపించారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు శుత్రీ వాల్‌ మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ‘నీ బాయ్‌ ఫ్రెండ్‌తో రొమాన్స్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేయడం అవసరమా? ఇలాంటి పనులు బహిరంగంగా చేయవద్దు’’ అని కామెంట్స్‌ చేశారు. (Shruti Haasan kisses to Santanu Hazarika)

2.jpg

Updated Date - 2023-10-27T14:48:08+05:30 IST