Allu Arjun: 'పుష్ప 2' కి ఎన్ని వందల కోట్లు ఆఫర్ చేసారో వింటే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-03-10T14:16:12+05:30 IST

అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు అని అన్ని చోట్లా వైరల్ అవుతుందో. అది ఆలా ఉంచితే, అతని సినిమా 'పుష్ప 2' కి జీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ వింటే షాక్ అవుతారు, నిజమే అర్జున్ కి అంత ఇవ్వొచ్చు అని కూడా అనుకుంటారు..

Allu Arjun: 'పుష్ప 2' కి ఎన్ని వందల కోట్లు ఆఫర్ చేసారో వింటే షాక్ అవుతారు

అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు వార్తల్లో వున్న నటుడు. ఎందుకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుడుగా వార్తల్లో వున్నాడు. కొందరు ఇది అతని పీఆర్ టీం చేస్తున్న హంగామా అని, మరికొంతమంది ఇది నిజమే అని పలు రకాలుగా సాంఘీక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి 'పుష్ప' (Pushpa) సినిమాతో విపరీతమయిన క్రేజ్ వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు అతనికి. అల్లు అర్జున్ 'పుష్ప 2' (Pushpa 2) సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ 'పుష్ప' అనే సినిమాని అంత సహజంగా తీశారు అని కూడా వార్తలు రాసారు కదా. తెలుగు కథని ప్రపంచ వ్యాప్తంగా చూపించే ఘనత సుకుమార్ వలెనే సాధ్యపడింది. ఈమధ్యనే సందీప్ వంగా (Sandeep Vanga) దర్శకత్వం లో ఒక సినిమా కూడా ఒప్పుకున్నాడు. దీన్ని టి సిరీస్ (T Series) వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కూడా.

alluarjun2.jpg

అయితే ఇప్పుడు 'పుష్ప 2' (Pushpa 2) సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కావచ్చు అని అంటున్నారు. ఈ సినిమాకి ఎంత క్రేజ్ వుంది అంటే, ఈ సినిమాకి జీ (Zee) వాళ్ళు ఇచ్చిన ఆఫర్ వింటే షాక్ అవుతారు. వాళ్ళు ఈ సినిమాకి అన్ని హక్కులు కలిపి రూపాయలు 900 కోట్లు (900 crore) ఇస్తామని చెప్పారు అని వినికిడి. పరిశ్రమలో ఇప్పుడు ఇదే పెద్ద టాక్ గా నడుస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాతలు 1050 కోట్లు (1050 crore) అడుగుతున్నారని, పరిశ్రమలో ఒకరు చెప్పారు. అసలు ఒక సినిమాకి ఇంకా షూటింగ్ అవుతుండగా ఇంత పెద్ద ఆఫర్ రావటం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. ఒకవేళ ఇదే కనక ఆలా ఇచ్చేస్తే చరిత్ర సృష్టించినట్టే అని పరిశ్రమలో అంటున్నారు. అతనికి అంత క్రేజ్ లేకపోతే, అతని సినిమాకి ఇన్ని వందల కోట్లు ఆఫర్ ఎలా ఇస్తారు అని చర్చ కూడా పరిశ్రమలో నడుస్తోంది.

pushpa2a.jpg

ఈ ఆఫర్ లో అన్ని భాషల ఓ.టి.టి, శాటిలైట్ హక్కులు ఉన్నాయని అంటున్నారు. మరి థియేట్రికల్ హక్కులు ఇందులో ఉన్నాయో లేదో తేలేద్దు కానీ, అవి వున్నా కూడా ఇంత అమౌంట్ అంటే, అసలు ఈ 'పుష్ప 2' అనే సినిమాకి ఎంత క్రేజ్ వుందో అర్థం అవుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమా లో అత్యద్భుత నటన కనపరిచాడు. ఈ సినిమా చాలా దేశాల్లో ఆడింది, అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన 'తగ్గేదే లే' అన్న మేనరిజమ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. కానీ ఈ సినిమా కి మంచి గిరాకీ వుంది అని తెలుసు కానీ, మరీ 900 కోట్లు అంటే షాకింగ్ గా లేదూ, నిర్మాతలు అయితే 1000 కోట్లు పైగా అడుగుతున్నారు. మరి ఇంతకీ ఫిక్స్ అవుతుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ 'పుష్ప 2' సినిమాకి నిర్మాతలు.

ఇది కూడా చదవండి:

ఏడడుగులతో ఒక్కటయిన పవిత్రనరేష్ జంట !

Updated Date - 2023-03-10T14:16:13+05:30 IST