Baby: ఈ చిన్న సినిమా పెద్ద సినిమా రేంజ్ లో మొదటిరోజు కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-07-15T14:57:27+05:30 IST

'బేబీ' సినిమా చాలా పాజిటివ్ టాక్ తో శుక్రవారం విడుదలైంది. ఎందుకంటే ఈ సినిమా ప్రీమియర్స్ గురువారం రాత్రి రెండు రాష్ట్రాల్లో వేశారు. ఆ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యడంతో ఈ సినిమా మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి.

Baby: ఈ చిన్న సినిమా పెద్ద సినిమా రేంజ్ లో మొదటిరోజు కలెక్షన్స్
Anand Deverakonda and Vaishnavi Chaitanya from Baby

ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAswin) నటించిన 'బేబీ' #Baby నిన్న విడుదల అయింది. సాయి రాజేష్ (SaiRajesh) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎస్కెఎన్ (SKN) ప్రొడ్యూస్ చేసాడు. ఈ సినిమాని గురువారం రోజు రెండు రాష్ట్రాల్లోనూ పైడ్ ప్రీమియర్స్ వేస్తె వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ధీరజ్ చెప్పాడు. ఆ ప్రీమియర్స్ తరువాత ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, శుక్రవారం విడుదల అయిన చాలా షోస్ హౌస్ ఫుల్స్ అవటమే కాకుండా, అదే స్ట్రాంగ్ కలెక్షన్స్ ని శనివారం కేరీ చేస్తోంది అని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.

మొదటి రోజు ఈ 'బేబీ' సినిమా కలెక్షన్స్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంత చిన్న సినిమాకి ఒక పెద్ద రేంజ్ సినిమాకి వచ్చినట్టుగా కలెక్షన్స్ రావటంతో ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు ఉందని అంటున్నారు. #BabyTheMovie మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.1 కోట్ల రూపోపాయాలు గ్రాస్ కలెక్టు చేసిందని, అంటే అది రూ. 3.9 కోట్లు ఉంటుందని అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రెండో రోజుకే వచ్చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

baby4.jpg

ఇలా ఈమధ్య కాలంలో ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించటం జరగలేదని కూడా అంటున్నారు. 'బేబీ' సినిమా ముగ్గురి మధ్య నడిచే ప్రేమ కథ, ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో వైష్ణవి చైతన్య చాలా మంచి నటన కనపరిచింది, అలాగే ఆనంద్ దేవరకొండ బెస్ట్ ఇచ్చాడు. విరాజ్ అశ్విన్ కూడా చాలా బాగా చేసాడు.

ఈ సినిమాలో వీరి ముగ్గురి చూట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. బస్తీ అమ్మాయి, కాలేజీకి వెళ్ళాక, స్నేహితులతో కలిసి ఎలా మారిపోయింది, కాలేజీలో ఒక ధనవంతుల కొడుకుతో తిరుగుతూ, బస్తీలో ప్రేమించే అబ్బాయిని ఏమి చేసింది అనేది ఈ సినిమా కథ. దర్శకుడు సాయి రాజేష్ ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపిస్తూ, మంచి మాటలు, సంగీతంతో ఈ సినిమాని ప్రేక్షకుడిని రంజింపచేసేట్టు చేయగలిగాడు, అందుకే అంత రెస్పాన్స్ వస్తోంది ప్రేక్షకుల నుండి అని అంటున్నారు. శనివారం, ఆదివారం ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్టు చేసే అవకాశాలు వున్నట్టుగా చెపుతున్నారు.

Updated Date - 2023-07-15T14:57:27+05:30 IST