Sharwanand: శర్వా పెళ్లి సందడి మొదలు.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-06-02T18:15:23+05:30 IST
నువ్వు.. నేను’. అంటూ పెళ్లికి శ్రీకారం చుట్టారు... రన్ రాజా రన్ అంటూ రాజస్థాన్ వేదికకు చేరుకున్నారు.. పడిపడి లేచిన మనసులతో మూడు మూళ్ల బంధంతో ఒకటి కానున్నారు... ‘శతమానం భవతి’ అనే ఆశీర్వచనాలతో... ‘ఒకే ఒక జీవితం’ అంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.
‘నువ్వు.. నేను’. అంటూ పెళ్లికి శ్రీకారం చుట్టారు...(Sharwanand)
రన్ రాజా రన్ అంటూ రాజస్థాన్ వేదికకు చేరుకున్నారు..
పడిపడి లేచిన మనసులతో మూడు మూళ్ల బంధంతో ఒకటి కానున్నారు...
‘శతమానం భవతి’ అనే ఆశీర్వచనాలతో... ‘ఒకే ఒక జీవితం’ అంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం వివాహ వేదిక దగ్గర పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు శర్వానంద్. ఆయన పెళ్లి పనులు షురూ అయ్యాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌లో (Jaipur) ఉన్న లీలా ప్యాలెస్ (Leela palace) వేదికగా శనివారం రక్షితా రెడ్డితో శర్వా (Sharwanand) వివాహం వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కాబోయే వధూవరులకు హల్దీ వేడుక నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఆ వీడియో వీక్షించిన నెటిజన్లు శర్వా-రక్షితలకు (Rakshitha reddy) శుభాకాంక్షలు చెబుతున్నారు. రక్షితారెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇక శర్వా విషయానికి వస్తే ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేయడానికి సైన్ చేశారు. పెళ్లి తంతు తర్వాత ఆయన ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.