Sekhar Master: రాకేశ్‌ మాస్టర్‌ దశ దినకర్మ.. శేఖర్‌ మాస్టర్‌ ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2023-06-29T13:38:08+05:30 IST

శేఖర్‌ మాస్టర్‌ (Sekhar master) పలు యూట్యూబ్‌ ఛానళ్లకు వార్నింగ్‌ ఇచ్చారు. 'వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాసి, పిచ్చిపిచ్చి థంబ్‌నైల్స్‌తో ఎన్నో కుటుంబాలు బాధకు గురయ్యేలా చేస్తున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయ గురువు రాకేశ్‌ మాస్టర్‌ (Rakesh Master) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! ఆరోగ్య సమస్యలతో అకాల మరణం చెందిన రాకేశ్‌ మాస్టర్‌ పెద్ద కర్మ ((Rakesh master 11day Cermony) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నిర్వహించారు

Sekhar Master: రాకేశ్‌ మాస్టర్‌ దశ దినకర్మ.. శేఖర్‌ మాస్టర్‌ ఏమన్నారంటే!

శేఖర్‌ మాస్టర్‌ (Sekhar master) పలు యూట్యూబ్‌ ఛానళ్లకు వార్నింగ్‌ ఇచ్చారు. 'వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాసి, పిచ్చిపిచ్చి థంబ్‌నైల్స్‌తో ఎన్నో కుటుంబాలు బాధకు గురయ్యేలా చేస్తున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయ గురువు రాకేశ్‌ మాస్టర్‌ (Rakesh Master) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! ఆరోగ్య సమస్యలతో అకాల మరణం చెందిన రాకేశ్‌ మాస్టర్‌ పెద్ద కర్మ ((Rakesh master 11day Cermony) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నిర్వహించారు. శేఖర్‌, సత్య మాస్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన గురువు రాకేశ్‌ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు వై.వి.ఎస్‌. చౌదరి, పలువురు డాన్స్‌ మాస్టర్లు తదితరులు పాల్గొని, రాకేశ్‌ మాస్టర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ‘‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ సినిమాతో రాకేశ్‌ మాస్టర్‌తో మా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచీ నా ప్రతి సినిమాలో ఆయన భాగస్వామ్యం ఉంది’’ అని దర్శకుడు వైవిఎస్‌ చౌదరి చెప్పారు. (Rip Rakesh Master)

‘‘మా గురువు రాకేశ్‌ మాస్టర్‌ గొప్ప డ్యాన్సర్‌. 8 ఏళ్ల అనుబంధం మాది. ఆయన డాన్సింగ్‌ స్కిల్స్‌ను యూట్యూబ్‌లో చూసింది 5 శాతమే. ఆయనలోని అసలు టాలెంట్‌ పూర్తిగా ఎవరికీ తెలీదు. వ్యక్తిగతంగా నేను మొదట ప్రభుదేవా మాస్టర్‌ నాకు స్ఫూర్తి. హైదరాబాద్‌ వచ్చాక రాకేశ్‌ మాస్టర్‌ని అభిమానించడం ప్రారంభించా. ఆయన నా గురువు అని చెప్పేందుకు గర్విస్తాను. అంత అద్భుతంగా డాన్స్‌ చేసేవారాయన. ప్రాక్టీస్‌ సమయంలో చిన్న పొరపాటు జరిగిన క్షమించేవారు కాదు. ఎప్పుడూ మాస్టర్‌ దగ్గరే ఉండేవాళ్లం. డ్యాన్స్‌ తప్ప మాకు మరో ప్రపంచం తెలియదు. ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం, సాయంత్రం క్లాసులు చెప్పేవాళ్లం. ఆయన ఎలా ఉన్నా, ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాగానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన పెళ్లి మేమే చేశాం. ఆయన మరణం తర్వాత కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్‌ పెట్టి వార్తలు రాస్తున్నారు. దాని వల్ల మాలాంటి ఎంతో మంది బాధపడుతున్నారు. ఇదే కాదు ఎవరి విషయంలోనైనా వాస్తవాలు మాత్రమే రాయండి. దయచేసి విషయాన్ని తెలుసుకోండి. లేదంటే రాయకండి’’ అని శేఖర్‌ మాస్టర్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - 2023-06-29T13:38:23+05:30 IST