Sarangadariya : 'సారంగదరియా' ఫస్ట్ లుక్ 

ABN , First Publish Date - 2023-11-21T17:26:39+05:30 IST

రాజా రవీంద్ర (Raja ravindra) ప్రధాన పాత్రలో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలూ గా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం  'సారంగదరియా' (Saranga Dariya)ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను  రాజ్ తరుణ్ చేతుల విడుదల చేసారు. 

Sarangadariya : 'సారంగదరియా' ఫస్ట్ లుక్ 

రాజా రవీంద్ర (Raja ravindra) ప్రధాన పాత్రలో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలూ గా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం  'సారంగదరియా' (Saranga Dariya)ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను  రాజ్ తరుణ్ చేతుల విడుదల చేసారు

ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ "సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న రాజా రవీంద్ర మంచి పాత్ర పోషించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది" అని అన్నారు, 

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ "దర్శకుడిగా తొలి చిత్రమిది. మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో ఈ సినిమా ఉంటుంది.  త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని అన్నారు. 

రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ ,మోహిత్,  నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  డైలాగ్స్-వినయ్ కొట్టి, ఎడిటర్ - రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ - M. ఎబెనెజర్ పాల్ సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు. 

Updated Date - 2023-11-21T17:28:09+05:30 IST