Sandeep Reddy Vanga: చిరంజీవి పేరుతో సమాధానమిచ్చేసరికి అంతా షాక్!
ABN , First Publish Date - 2023-03-16T18:49:56+05:30 IST
‘‘సినిమాల వల్ల్ల సమాజం చెడిపోతోంది. సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాకు ఉంది’ అనేది ‘ఓవర్ రేటెడ్’ చర్చ అని దర్శకుడు దేవకట్టా (Deva katta) అభిప్రాయపడ్డారు.
‘‘సినిమాల వల్ల్ల సమాజం చెడిపోతోంది. సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాకు ఉంది’ అనేది ‘ఓవర్ రేటెడ్’ చర్చ అని దర్శకుడు దేవకట్టా (Deva katta) అభిప్రాయపడ్డారు. గాయని స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘నిజం’ కార్యక్రమంలో దర్శకులు దేవ కట్టా, సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) ఈ వారం అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎలా మొదలైంది? ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు అన్న విషయాలను చెప్పుకొచ్చారు. శుక్రవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు నేను చేసే పనులు చూసి మా అమ్మాకు చెబుతామంటూ నన్ను బెదిరించేవారు. అప్పుడు అందరికీ ఒకటే సమాధానం చెప్పేవాడిని. ‘ఘరానా మొగుడు’ (Gharana mogudu) సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి (Chiranjeevi) కూడా మంటల్లోకి దూకారు. అప్పుడు ఆయనకు ఏం కాలేదు కదా’ అని సమాధానం ఇచ్చేవాణ్ని. నా జవాబుకి అంతరూ షాక్ అయ్యేవారు. అసలు నేను కెమెరామెన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. కానీ దర్శకుడిని అయ్యా’’ అన్నారు.
‘‘నేను చెన్నైలో పుట్టి పెరిగాను. మణిరత్నం, భారతీరాజా, బాలచందర్ తీసిన సినిమాలతోపాటు ‘శివ’ సినిమాతో స్ఫూర్తి పొందాను. అలా సినిమా వైపు అడుగులు వేశాను’’ అని చెప్పారు దేవకట్టా.