Samyuktha: నా పేరు మారింది.. ఆ తోక అవసరం లేదనిపించింది!

ABN , First Publish Date - 2023-02-09T16:34:58+05:30 IST

‘భీమ్లానాయక్‌’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కథానాయిక సంయుక్తా మీనన్‌. రానాకు జోడీగా నటించి మెప్పించిన ఈ కేరళ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్‌’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రంలో రూపొందుతోంది.

Samyuktha: నా పేరు మారింది.. ఆ తోక అవసరం లేదనిపించింది!

‘భీమ్లానాయక్‌’ (Bheemla nayak Fame)సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కథానాయిక సంయుక్తా మీనన్‌(Samyuktha). రానాకు జోడీగా నటించి మెప్పించిన ఈ కేరళ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్‌’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రంలో రూపొందుతోంది. తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె తన పేరును మార్చుకున్నారు. సంయుక్తా మీనన్‌గా ఉన్న తన పేరును సంయుక్తగా మార్చుకున్నారు. దానికి గల కారణాన్ని ఆమె చెప్పుకొచ్చారు. (No need of tails in front of name)

‘‘నా పేరు వెనుక మీనన్‌ను తొలగించాలని చాలాకాలంగా అనుకుంటున్నా. స్కూల్‌లో చేరినప్పుడు ఇంటిపేరుతో సహా మన పేరు రాస్తుంటారు. అలాగే నాక్కూడా సంయుక్త మీనన్‌ అని నమోదు చేశారు. అప్పట్లో దాని గురించి అంతగా అవగాహన లేదు. ఒక వ్యక్తి పేరు వెనుక ఎందుకు ఇలాంటి తోకలు ఉండాలనే ఆలోచన వచ్చింది. నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నా. అంతే కాదు నా తల్లిదండ్రులు ఎంతోకాలం క్రితం విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరుని కొనసాగించడం అమ్మకు ఇష్టం లేదు. నా తల్లి భావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇకపై నా సోషల్‌ మీడియా పేజీల్లో, సినిమాల్లోనూ నా పేరు సంయుక్తగానే ఉంటుంది’’ అని అన్నారు. (I dont want father name - Samyuktha)

తన చేస్తున్న చిత్రాలు, నటన గురించి చెబుతూ ‘‘నటిగా విలక్షణమైన పాత్రల్లో నటించాలని నా కోరిక. నేను అనుకున్నట్లుగా మంచి పాత్రలు వస్తున్నాయి. ధనుష్‌తో చేస్తున్న ‘సార్‌’ (sir)చిత్రంలో నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. సెకండాఫ్‌లో సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. ఇందులో నా పాత్రకు ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువ. చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అందువల్ల ఎమోషనల్‌ సీన్స్‌లో నటించడం నాకు సవాల్‌గా అనిపించలేదు’’ అని ఆమె వివరించింది.

Updated Date - 2023-02-09T16:34:59+05:30 IST