Samantha: మొదటిస్థానం సాధించింది!

ABN , First Publish Date - 2023-05-04T22:29:16+05:30 IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటారో...

Samantha: మొదటిస్థానం సాధించింది!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు (Samantha) ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటారో... సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా సందడి చేస్తుంటారు. ఇటీవల ఆమె నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘శాకుంతలం’ (Shakkuntalam) విడుదలైంది. ఆ పాత్ర కోసం సమంత పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. అయితే తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర తారలను పక్కకు నెట్టి పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది సామ్‌. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో సమంత మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇండియన్‌ మూవీ డేటాబేస్‌(ఐఎండీబీ)-(Imdb) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌లకు స్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన బట్టి రేటింగ్స్‌ ఇస్తుంటుంది. తాజాగా పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది. దీనిలో సమంత మొదటిస్థానం దక్కించుకుంది. గతంలో తొమ్మిదో స్థానంలో ఉన్న సమంత ఈ సారి మొదటి స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. ఇదే లిస్ట్‌లో పూజా హెగ్డే 17వ స్థానంలో ఉంది. ఆర్మాక్స్‌ లిస్టులో సమంత వరుసగా ఏడు సార్లు టాప్‌లో ఉంది.

తాజాగా సమంత హీరోయిన్‌గా గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ అంచనాల మధ్య విడుదలై సామ్‌కు నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో యాక్ట్‌ చేస్తోంది. మరెవైపు సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేస్తోంది. దీనిలో యాక్షన్‌ సీన్స్‌ కోసం సామ్‌ చాలా కష్టపడుతోందని దర్శకులు చెబుతున్నారు

Updated Date - 2023-05-04T22:30:31+05:30 IST