Samantha: సమంత చెప్పిన ఐదు విషయాలు.. వైరల్!
ABN , First Publish Date - 2023-04-11T15:29:49+05:30 IST
సమంతకు పూలంటే అలర్జీ. శకుంతల పాత్ర కోసం పలు సందర్భాల్లో చేతికి, మెడకి వాటిని చుట్టుకున్నందుకు ఆమెకు దద్దుర్లు వచ్చాయట.
సమంత (Samantha) టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’(Shakuntalam) గుణశేఖర్ (gunasekhar)దర్శకత్వంలో నీలిమా గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లో బిజీ అయ్యారు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో #Ask Samantha అంటూ నెటిజన్లతో ముచ్చటించారు. శాకుంతలం’కు సంబంధించి ఐదు క్రేజీ విషయాలను చెప్పుకొచ్చారు. (Samantha 5 Crazy Titbits)
1. సమంతకు పూలంటే అలర్జీ. శకుంతల పాత్ర కోసం పలు సందర్భాల్లో చేతికి, మెడకి వాటిని చుట్టుకున్నందుకు ఆమెకు దద్దుర్లు వచ్చాయట. ఒక రోజంతా ఏమీ తెలియలేదు కానీ రెండు రోజుకి మాత్రం అవి టాటూలాగా కనిపించాయని సమంత చెప్పారు. ఆరు నెలలపాటు అవి అలాగే మచ్చలాగా ఉన్నాయని, షూటింగ్ సమయంలో ఆ మచ్చలు కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసినట్లు తెలిపారు.
2. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శకుంతల పాత్రకు సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పారు. అది కష్టంతో కూడిన పని అయినా ఒరిజినల్ వాయిస్ ఆ పాత్రకు చాలా అవసరం అని చెప్పారు. అదే ఫీల్‌లో ఉండి నిద్రలో కూడా ఆ డైలాగులను కలవరించేదట.
3. షూటింగ్ సమయంలో సమంతను కుందేలు కరిచిందట. సెట్లో చాలా కుందేళ్లు ఉండేవని వాటిల్లో ఒకటి తనని కరిచిందని సమంత అన్నారు. దాంతో ముద్దుగా ఉండే ఆ కుందేలు అసలు ముచ్చటేయలేదట. ఆ కుందేలు క్యూట్‌గానే లేదట.
4. ‘శాకుంతలం’లో కనిపించే జుట్టు తనది కాదని సమంత చెప్పారు. ఆ జుట్టు ఒరిజినల్ కాదని తెలిపారు.
5. సినిమాలో ఓ పాట కోసం ఆమె ధరించిన లెహెంగా బరువు 30 కేజీలని సమంత చెప్పారు. ఆ బరువుతో డాన్స్ చేయడం చాలా ఇబ్బంది కలిగిందని అన్నారు. డాన్స్‌లో భాగంగా చుట్టూ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు సామ్ ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచేవాడట. ‘నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోంది’ అని సమంత కూడా గట్టిగానే సమాధానం ఇచ్చేదట. అలా చేయడంతో సెట్లో అంతా నవ్వేవారట.