Samantha: మయోసైటిస్ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన సామ్!
ABN , First Publish Date - 2023-01-06T15:41:19+05:30 IST
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). అనారోగ్యంతో బాధపడుతుంటంతో కొంతకాలంగా ఆమె బయటకు రావడం లేదు. మయోసైటిస్ కారణంగా పబ్లిక్‌గా దర్శనమివ్వడం మానేసింది.
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). అనారోగ్యంతో బాధపడుతుంటంతో కొంతకాలంగా ఆమె బయటకు రావడం లేదు. మయోసైటిస్ కారణంగా పబ్లిక్‌గా దర్శనమివ్వడం మానేసింది. చాలా కాలం తర్వాత సామ్ తాజాగా బయటకు వచ్చింది. ముంబై ఎయిర్ పోర్టులో తొలిసారిగా దర్శనమిచ్చింది. తెలుపు రంగు దుస్తులు ధరించి కనిపించింది. అభిమానులకు కూడా సెల్ఫీలు ఇచ్చింది. అనారోగ్యం బారిన పడటంతో ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటడెల్’ (Citadel) నుంచి ఆమెను తొలగించారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఆమె ప్లేస్‌లోకి మరొకరిని తీసుకున్నారని వదంతులు షికార్లు కొట్టాయి. ఈ వార్తలన్నింటిని ఆమె టీమ్ ఖండించింది. జనవరి మూడో వారం నుంచి సామ్ షూటింగ్‌ను మొదలుపెడుతుందని టీమ్ ప్రకటనను వెలువరించింది. ‘సిటడెల్’ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. అవెంజర్స్ ఫేమ్ రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు.
‘యశోద’ ట్రైలర్ విడుదలయిన సమయంలో సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘మయోసైటిస్’ తో బాధపడుతున్నట్టు పేర్కొంది. ‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసైటిస్’ (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కానీ, నేను కోలుకోవడానికి ఆలస్యమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటాను. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ’’ అని సమంత ట్వీట్ చేసింది.