Samantha: రెండేళ్లల్లో చాలా జరిగాయి.. అవన్నీ ఊహించనివి!
ABN , First Publish Date - 2023-04-09T23:19:32+05:30 IST
గడిచిన రెండేళ్లల్లో ఎన్నో జరిగాయి. ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయనియ తెలుసుకున్నా.
"గడిచిన రెండేళ్లల్లో ఎన్నో జరిగాయి. ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయనియ తెలుసుకున్నా(Samantha) . దీనితో ఇప్పుడు నేను దేనికైనా సిద్థపడి ఉన్నానని అనుకుంటున్నా! ఆ ధైర్యం నాలో పెరిగింది’’ అని సమంత (Samantha) అన్నారు. ఆమె కథానాయికగా గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ నెల 14న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సామ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. (Samantha life lessons)
జవాబు ‘అవును’ అయితే...
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వైఫల్యాలను మీరెలా తీసుకుంటారన్న ప్రశ్నకు ‘నా కెరీర్‌లో సక్సెస్ కన్నా.. ఫెయిల్యూర్స్ ఎన్నో పాఠాలు నేర్పించాయి. నాలో ఎంతో మార్పు తీసుకొచ్చిన గుణపాఠాలవి. అపజయాలు ఎదురైనప్పుడే ఏదో సాధించాలనే కసి పెరుగుతుంది. మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన పాత్రను నేను భయపడుతూ చేస్తానా? లేదా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటా. దానికి జవాబు ‘అవును’ అయితే ఆ పాత్ర కచ్చితంగా చేసి తీరతా. ‘శాకుంతలం’ పాత్ర అలా చేసిందే. ఈ కథ విన్నప్పుడు భయపడ్డా. ఆ పాత్రలోకి పూర్తిగా వెళ్లాక చాలా స్ఫూర్తి పెరిగింది.
నేను గర్వించే సీన్ అక్కడే..
శాకుంతలంతో అందమైన చరిత్రను మీరు చూడబోతున్నారు. సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు సిద్థంగా ఉండండి. గుణశేఖర్ మిమ్మల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఈ చిత్రంలో సెకెండాఫ్ నాకు చాలా కష్టంగా అనిపించింది. నేను గర్వపడేలా చేసిన సీన్ కూడా సెకండాఫ్‌లో ఉంటుంది. అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. నిజంగా ఈ చిత్రం ఓ విజువల్ ట్రీట్. శాకుంతలం చిత్రం కోసం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేను డబ్బింగ్ చెప్పుకొన్నా. అది కష్టమే అయినా, ఈ కథకు అవసరం. భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగాలనుకుంటున్నా.