Samantha : కొత్త జర్నీ ప్రారంభం!

ABN , First Publish Date - 2023-12-10T22:48:37+05:30 IST

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత వృత్తిపరంగా కొత్త జర్నీ ప్రారంభించారు. తాజాగా ఆమె ప్రొడక్షన్‌ హస్‌ ప్రారంభిస్తునట్లు ఆమె వెల్లడించారు. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ అని పేరు పెట్టినట్లు చెప్పారు.

Samantha : కొత్త జర్నీ ప్రారంభం!

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత వృత్తిపరంగా కొత్త జర్నీ ప్రారంభించారు. తాజాగా ఆమె ప్రొడక్షన్‌ హస్‌ ప్రారంభిస్తునట్లు ఆమె వెల్లడించారు. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. తనకు బాగా ఇష్టమైన సాంగ్‌ ‘బ్రౌన్‌ గర్ల్‌ ఈజ్‌ ఇన్‌ ది రింగ్‌ నౌ’ (హాలీవుడ్‌) లిరిక్స్‌ స్ఫూర్తితో ట్రాలాలా అని పేరు పెట్టానని అన్నారు. న్యూ టాలెంట్స్‌ పోత్సహించడమే తన సంస్థ లక్ష్యమన్నారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే అర్థవంతమైన, యూనివర్సల్‌ స్టోరీలు చెప్పగలిగే దర్శకులకు ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ వేదికగా నిలుస్తుంది’’ అని అన్నారు. సమంత పోస్ట్‌ చూసిన చాలామంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ‘

‘కామెడీ, ఎమోషన్స్‌ను నేను బాగా డీల్‌ చేయగలను. యాక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నా. ప్లీజ్‌ మేడమ్‌.. నాకో అప్లికేషన్‌ ఇవ్వండి’’ అంటూ దర్శకురాలు నందిని రెడ్డి సరదాగా కామెంట్‌ చేశారు. ‘కంగ్రాట్స్‌.. మేడమ్‌ మీ సినిమాల్లో యంగ్‌ హీరో అవసరం ఉంటే నాకు కాల్‌ చేయండి’ అని నటుడు తేజ సజ్జ కామెంట్‌ చేశారు. తాజాగా ప్రత్యూష ఫౌండేషన్‌ చిన్నారులతో కలిసి సమంత హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘హాయ్‌ నాన్న’ చిత్రాన్ని చూశారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్లు సమంతను ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-12-10T22:48:39+05:30 IST