Samantha: కేరవ్యాన్.. కష్టం.. సమంత పోస్ట్‌కి అర్థమేంటి?
ABN , First Publish Date - 2023-07-10T13:18:47+05:30 IST
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. అసలు సమంత ఆ పోస్ట్ పెట్టడానికి కారణమేంటి అని నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. అసలు సమంత ఆ పోస్ట్ పెట్టడానికి కారణమేంటి అని నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే నిజమే అనిపిస్తోంది. ‘కారవాన్ ఫొటో పెట్టిన సమంత.. ‘‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’’ అని పోస్ట్ పెట్టింది. మరో పోస్ట్‌లో ‘‘ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’’ అని పేర్కొంది. (kushi)
దీంతో సమంత ఎంతో కష్టంగా షూటింగ్స్‌లో పాల్గొందో అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Samantha viral post) గత ఏడాది మయోసైటిస్ సమస్యతో బాధపడిన ఆమె నెలలకు కోలుకుంది. అయితే ఆ సమస్య నుంచి పూర్తిగా కోలుకోలేనట్లు సమంత మాటలతో అర్ధమవుతోంది. అందుకే కాస్త రెస్ట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. అయితే నెటిజన్లు మరో మాట కూడా అంటున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాల షూటింగ్ పూర్తికావొస్తుండడంతో సమంత అలా పోస్ట్ చేసిందని అంటున్నారు. అసలు విషయం ఏంటనేది సమంత చెబితే గాని తెలీదు. ప్రస్తుతం సామ్ ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న ‘ఖుషి’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తాజా ప్రోమోను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.