Samantha: ఒంట్లో బాగోలోకేపోయినా, 'ఖుషి' సినిమా ప్రచారానికి తనవంతు కృషి చేసింది

ABN , First Publish Date - 2023-08-17T11:37:21+05:30 IST

సమంత తనకి ఒంట్లో బాగోలేకపోయినా, తాను చేసిన 'ఖుషి' సినిమాకి ప్రచారం చెయ్యాలని మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొనటమే కాకుండా అందులో లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చింది.

Samantha: ఒంట్లో బాగోలోకేపోయినా, 'ఖుషి' సినిమా ప్రచారానికి తనవంతు కృషి చేసింది
Samantha and Vijay Deverakonda at the live music concert

సమంత (Samantha) 'ఖుషి' #Khushi సినిమా ప్రచారానికి ఇక రాదు అని తెలిసింది. ఆమెకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో అమెరికా వెళ్లి అక్కడ శస్త్ర చికిత్స చేయించుకొని మళ్ళీ ఇండియాకి వస్తుంది అని తెలిసింది. ఈమధ్యలోనే ఆరోగ్యం కొంచెం కుదుట పడుతున్నప్పుడే చేయాల్సిన సినిమా, వెబ్ సిరీస్ ముందుగా పూర్తి చేసింది, అందులో 'ఖుషి' సినిమా ఒకటి. ఈ సినిమా ఆమె కెరీర్ లో చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఆమె కొంత కాలం విరామం తీసుకోవాలని అనుకుంటోంది. తరువాత సిటాడెల్ #Citadel వెబ్ సిరీస్ కూడా చేసేసింది.

ఇంతకు ముందు చేసిన 'శాకుంతలం' #Shaakuntalam సినిమా మీద ఎంతో ఆశ పెట్టుకుంది, కానీ ఆ సినిమా బాక్స్ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు ఈ 'ఖుషి' మీదే ఆశలు పెట్టుకుంది, చాలా నమ్మకంగా కూడా వుంది. దర్శకుడు శివ నిర్వాణ (ShivaNirvana), కథానాయకుడు విజయ్ దేవరకొండ (VijayDeverakonda) ఇద్దరూ ఈ సినిమా మీద నమ్మకంతో వున్నారు, అలాగే సమంత (Samantha) కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నారు. అంటే సమంత ఈ సినిమా కోసం ఎంత కష్ట పడిందో వాళ్లిద్దరూ ఆ ప్రచారంలో చెప్పారు కదా.

samantha-khushi3.jpg

అందుకే ఈ సినిమా ప్రచారాలకు తనకి ఒంట్లో బాగోలేకపోయినా కూడా మ్యూజిక్ కన్సర్ట్ కి వచ్చింది. అక్కడ డాన్స్ కూడా చేసింది. డాన్స్ అయిపోయాక సమంత ఒక అరగంటపాటు మళ్ళీ మామూలు మనిషి అవలేకపోయింది అని అక్కడ ఆమెతో వున్న వాళ్ళు చెపుతున్నారు. "పాపం ఆమె ఒంట్లో సరిగా లేకపోయినా, తన వంతు కృషిగా ఈ సినిమా ప్రచారం కోసం వచ్చింది, అలాగే లైవ్ లో డాన్స్ కూడా చేసి చూపించింది. అంతసేపు డాన్స్ చెయ్యడంతో బాగా నీరసం వచ్చేసింది, కానీ అవేమీ బయటకి చెప్పకుండా తన సినిమా ప్రచారంలో పాల్గొంది," అని అక్కడ చిత్ర సభ్యుడు వ్యాఖ్యానించాడు.

ఇదే ఆమె ఈ సినిమా కోసం ఇచ్చే ఆఖరి ప్రచారం అని కూడా తెలుస్తోంది. మళ్ళీ సినిమా సక్సెస్ మీట్ లో కలిస్తే కలవొచ్చు అని అంటున్నారు. అలాగే వీడియో ప్రచారాల్లో కూడా పాల్గొని తన వంతు ప్రచారాన్ని నిర్వహించింది. అవి కూడా త్వరలో విడుదల చేస్తారని తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదల అవుతోంది. ప్రచారంలో భాగంగా సమంత మళ్ళీ తాను కోలుకొని స్ట్రాంగ్ గా వస్తాను అని, ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేస్తాను అని చెప్పింది. ఆమె అన్నట్టే ఆమె ఆరోగ్యంగా వచ్చి మరిన్ని సినిమాలు చేస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.

Updated Date - 2023-08-17T11:37:21+05:30 IST