Samantha: హమ్మయ్య, ఇప్పుడు 'ఖుషీ'గా వుంది, ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-03-08T15:51:32+05:30 IST

వింతయిన వ్యాధి నుండి కోలుకొని హిందీ వెబ్ సిరీస్ కి ప్రాధాన్యం ఇచ్చి ముంబై వెళ్ళిపోయిన సమంత ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో ఎందుకు వైరల్ అయిందో తెలుసా...

Samantha: హమ్మయ్య, ఇప్పుడు 'ఖుషీ'గా వుంది, ఎందుకంటే...

చాలా నెలలు అయింది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) సినిమా 'ఖుషీ' (Khushi) షూటింగ్ ఆగిపోయి. ఎందుకు అంటే, అందులో నటిస్తున్న కథానాయకురాలు సమంత (SamanthaRuthPrabhu) రానందువలన. ఆమెకి ఒక వింతయిన వ్యాధి మయోసిటిస్ (myositis) రావటం, ఆ తరువాత ఆమె కోలుకున్నాక, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ (Citadel) చెయ్యడానికి ముందు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటి అంటే, సమంత తెలుగు సినిమా 'ఖుషీ' షూటింగ్ లో పాల్గొంటోంది అని. గత రెండు రోజుల నుండి సమంత 'ఖుషీ' సినిమా షూటింగ్ లో పాల్గొతోందని, షూటింగ్ కూడా జరుగుతోందని చెప్తున్నారు.

samantharuthprabhu3.jpg

సమంత రావటంతో 'ఖుషీ' యూనిట్ సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకొని, ఉత్సాహంగా పని చేస్తున్నారు. గత సంవత్సరం అంటే సుమారు ఏడూ ఎనిమిది నెలలు అయి ఉంటుంది, ఈ సినిమా ఆగిపోయి, మళ్ళీ ఇన్నాళ్లకు మొదలయింది. అందుకని అందరూ సంతోషంగా ఉండటమే కాకుండా, ఇప్పుడు త్వరగా పూర్తి చేసే ఆలోచనలో వున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు (Samantha birthday celebrations) సంబరాలు ఇదే సినిమా షూటింగ్ మధ్యలో అర్థరాత్రి జరిగిన విషయం తెలిసిందే. మళ్ళీ సమంత పుట్టినరోజు కూడా వచ్చేస్తోంది, ఈ సంవత్సరం కూడా ఇదే సినిమా షూటింగ్ లో చేస్తారేమో చూడాలి. అంటే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టి ఇన్ని రోజులు అయినా ఇంతవరకు పూర్తి అవలేదు అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

samantharuthprabhu1.jpg

ఇదిలా ఉంటే, ఇప్పుడు సమంత సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న 'శాకుంతలం' (Shakuntalam) నుండి ఒక పోస్టర్ విడుదల చేశారు. అలాగే 'ఓ! బేబీ' (Oh!Baby) సినిమా కూడా ఈరోజు మళ్ళీ విడుదల అయింది. అందులో ఒక పాట కూడా సాంఘీక మాధ్యమం లో వైరల్ అయింది. అలాగే సమంత కి ఇన్ స్టా లో (Instagram) 25 మిలియన్ (25 million) ఫాలోవర్స్ అయ్యారు. అది కూడా వైరల్ అవుతోంది. ఇలా సమంత ఈరోజు వైరల్ అవుతూ వస్తోంది.

ఇది కూడా చదవండి:

ఏంటిరా బాబూ ఇతనికి ఇన్ని కష్టాలు

Updated Date - 2023-03-08T15:51:33+05:30 IST