Samantha: అందులో బన్నీ జోక్యం అవసరం లేదు!

ABN , First Publish Date - 2023-04-08T20:58:53+05:30 IST

‘‘నేను ప్యాన్‌ ఇండియా స్టార్‌నని నా పెంపుడు జంతువులకు ఎవరన్నా చెబితే బావుండును. నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్నాను(నవ్వుతూ).

Samantha: అందులో బన్నీ జోక్యం అవసరం లేదు!

‘‘నేను ప్యాన్‌ ఇండియా స్టార్‌నని (samantha)నా పెంపుడు జంతువులకు ఎవరన్నా చెబితే బావుండును. నేనింకా వాటి మల మూత్రాలను ఎత్తిపోస్తున్నాను(నవ్వుతూ). ప్యాన్‌ ఇండియా సినిమాల్లో నటించడం వల్ల నా జీవితంలో ఎలాంటి మార్పులేదు. ఆరు గంటల వరకే నేను స్టార్‌ని. ఆ తర్వాత నా జీవితం సాదాసీదాగా ఉంటుంది’’ అని సమంత (Samantha)అన్నారు. గుణశేఖర్‌ (Gunashekar) దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘శాకుంతలం’ చిత్రం ఈ నెల 14 ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సమంత ముంబైలో మీడియాతో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

చిన్ననాటి నుంచి నాకు డిస్నీ జానర్‌ చిత్రాలంటే ఇష్టం. నేను ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా అవే చూస్తా. శాకుంతలం సినిమాలో యువరాణిగా నటించడం చాలా కొత్తగా అనిపించింది. మొదట ఈ కథ చేయాలంటే భయపడ్డా. కానీ సవాల్‌ విసిరే పాత్ర చేయాలని ఈ సినిమా చేశా. ఇలాంటి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్‌. ఈ చిత్రం కథ, పాత్రలు, దర్శకుడు తెరకెక్కించి విధానం అందరినీ అలరిస్తుంది. మహిళలు, పిల్లలు, ఫ్యామిలీలు తప్పకుండా ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు ఓ ప్రేక్షకురాలిగా పాత్రను ఆస్వాదించాను. ఇది సింపుల్‌గా చెప్పే కథ కాదు. ఇందులో ప్రేమ, మోసం ఉంది. అంతకు మించిన భావోద్వేగాలు చాలానే ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలకు పూర్వం రాసిన కష్టమైన కథ ఇది. శకుంతల పాత్రకు పక్కాగా న్యాయం చేశాను. (shaakuntalam)

గుణశేఖర్‌ సంకల్పం అదే..

నా దృష్టిలో దర్శకుడు గుణశేఖర్‌ ఫెమినిస్ట్‌. ఆయన ఫీమేల్‌ ఓరియంటెడ్‌ కథలు బాగా రాస్తారు. రిస్క్‌ తీసుకోవడానికి భయపడరు. గొప్ప గొప్ప కథలను మహిళల చుట్టూ ఆసక్తికరంగా నడపగలరని ఈ సినిమా చేశాక అర్థమైంది. మహిళామణుల జీవిత విశేషాలతో సినిమాలు తీయాలన్నది గుణశేఖర్‌ సంకల్పం. అందులో భాగంగా చేసిన చిన్న ప్రయత్నం ఈ సినిమా. మండు వేసవిలో కుటుంబమంతా కూర్చుని చూడాల్సిన సినిమా ఇది. డిస్నీఫైడ్‌ శాకుంతలం చూడటానికి అంతా సిద్థంగా ఉండండి.

రూట్‌ మార్చా...

నటిగా ఈ జర్నీలో ఇక్కడిదాకా వస్తాననుకోలేదు. తొలి సినిమా చేసినప్పుడు ఆ ఊహ కూడా నాకు లేదు. చేస్తున్న పాత్రతో ఆనందంగా ఉన్నానా లేదా అన్నదే చూసేదాన్ని. ఇప్పుడు నన్ను చూసుకుని నేనే గర్విస్తుంటా. ఇప్పుడు నేను రూట్‌ మార్చాను. యాక్షన్‌ పాత్రలు కూడా చేస్తున్నాను. ‘ఫ్యామిలీమ్యాన్‌2’లో చేసిన పాత్ర ఆ తరహాదే. ఎప్పుడూ స్ర్కీన్‌ మీద ఎవరో ఒక హీరో వచ్చి కాపాడటం లాంటి రొటీన్‌ పాత్రలే కాకుండా ఇలా డిఫరెంట్‌ పాత్రలు కూడా చేయాలి.. ఎప్పుడు తెరపై అబలగానే కాకుండా సబలగా కూడా నటించాలి. ఆ తరహా పాత్ర చేయడం కొత్తగా ఉంది. ఆ అనుభూతిని బాగా ఆస్వాదిస్తున్నా.

బన్నీ జోక్యం అవసరం లేదు...( allu arjun)

నా దృష్టిలో అల్లు అర్హ చాలా ఇండిపెండెంట్‌ అమ్మాయి. ఏదన్నా చేయాలంటే తానే నిర్ణయం తీసుకోగలదు. తన తండ్రి అల్లు అర్జున్‌ ఆమె విషయాల్లో జోక్యం చేసుకోనవసరం లేదు. ఈ చిత్రంలో భరత్‌ పాత్రలో అర్హ అద్భుతంగా యాక్ట్‌ చేసింది. లీడ్‌ కేరక్టర్లన్నీ ఒక ఎత్తు, అర్హ పాత్ర ఒక ఎత్తు. అందుకే పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడతారని చెబుతున్నా.

Updated Date - 2023-04-08T21:08:09+05:30 IST