Samantha: భయపడ్డా... కానీ చిన్నప్పటి కల నెరవేరింది
ABN , First Publish Date - 2023-04-07T19:52:45+05:30 IST
‘‘శాకుంతలం’’ సినిమా కోసం మొదట నన్ను సంప్రదించినప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్2’తో బిజీగా ఉన్నా. అందువల్ల కుదరదు అని చెప్పాను.
‘‘శాకుంతలం’’ (shaakuntalam) సినిమా కోసం మొదట నన్ను సంప్రదించినప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్2’(Family man) తో బిజీగా ఉన్నా. అందువల్ల కుదరదు అని చెప్పాను. నిజంగా ఈ సినిమాలో భాగం కాకపోతే మంచి సినిమా మిస్ అయ్యేదాన్ని’’ అని సమంత అన్నారు. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ఆమె టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’ నీలిమా గుణ నిర్మాత. ఈ నెల 14న ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం టీమంతా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమంత (samantha) ఆసక్తికర విషయాలు చెప్పారు.
‘‘శాకుంతలం’ కథ నా దగ్గరికి వచ్చినప్పుడునేను అంగీకరించలేదు. బలమైన పాత్ర కావడంతో భయపడి తిరస్కరించాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి డిస్నీ జానర్ అంటే చాలా ఇష్టం. నేను బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా డిస్నీ చిత్రాలే చూస్తా. అలాంటి సినిమాల్లో నటించడం నాకు డ్రీమ్‌గా ఉండేది. ‘శాకుంతలం’లో మునికన్య పాత్రకు న్యాయం చేయగలనా అని చాలా భయపడ్డా. గత మూడేళ్లలో నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గొప్ప పాత్ర చేయగలనా అనిపించింది. పైగా ఇది సవాల్ విసిరే పాత్ర కావడంతో కాస్త భయపడ్డాను. అప్పుడు దిల్ రాజుతో 9Dil raju)మాట్లాడాను. ఆయన నాలో ఎంతో నమ్మకాన్ని పెంచారు. ఈ చిత్రంలో నటించాను కాబట్టే చిన్నప్పటి నా కల తీరింది’’ అని అన్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. భరతగా అల్లు అర్హ కనిపిస్తారు. ‘‘సినిమా ప్రారంభించిన కొత్తలో చాలా కష్టంగా అనిపించేది. తెలుగులో డైలాగులో డైలాగ్‌లో చెప్పడంలో సమంత నాకు సాయం చేశారు. ఇంత అద్భుతమైన చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని దేవ్ మోహన్ చెప్పారు.