Samantha: బంధం విఫలమైతే అంతా అయిపోయినట్లేనా?

ABN , First Publish Date - 2023-03-28T18:40:17+05:30 IST

మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. కమిట్‌ అయిన చిత్రాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు సామ్‌.

Samantha: బంధం విఫలమైతే అంతా అయిపోయినట్లేనా?

మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సమంత(Samantha) మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. కమిట్‌ అయిన చిత్రాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు సామ్‌. తాజా ఆమె నటించి, విడుదలకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత పారితోషికం (Fight for Remunaration) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నటీనటులకు సమాన పారితోషికం ఉండాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా. ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై నేనొక స్టాండ్‌ తీసుకుని పోరాడుతున్నాను. అయితే హీరోలకు, హీరోయిన్‌లకు సమాన పారితోషికం ఉండాలని నేను పోరాటం చేసినట్లు కాదు. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా శ్రమ, హార్డ్‌వర్క్‌ చూసి ‘మేము ఇంత రితోషికం ఇవ్వాలనుకుంటున్నాం’ అని సినిమాకు చెందిన వాళ్లే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత రెమ్యునరేషన్‌ ఇవ్వండి అని యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగానే అవకాశాలు దక్కుతాయి. ఎప్పటికప్పుడు మన ప్రతిభను పెంచుకుంటూ పోవాలి’’ అని అన్నారు.

బంధం విఫలమైతే...

ప్రేమ గురించి కూడా సమంత సెలవిచ్చారు. ప్రేమ అనేది స్ర్తీ, పురుషుల మధ్య మాత్రమే ఉండేది కాదని.. ఇద్దరు స్నేహితుల మధ్య కూడా ప్రేమానురాగాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. బంధం విఫలమైతే అంతా అయిపోయినట్లు కాదు అని సమంత తెలిపారు. ఆమె టైటిల్‌ పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2023-03-28T18:40:43+05:30 IST