Sai Pallavi: చేతలతోనే కాదు మాటలతో ఇబ్బంది పెట్టినా అవి వేధింపులే

ABN , First Publish Date - 2023-03-10T20:01:35+05:30 IST

మలయాళం సినిమా ‘ప్రేమమ్’ (Premam) తో ప్రేక్షకులకు చేరువైన నటి సాయి పల్లవి (Sai Pallavi). ‘ఫిదా’ (Fidaa) లో భానుమతి పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కథనాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ అందాల భామ.

Sai Pallavi: చేతలతోనే కాదు మాటలతో ఇబ్బంది పెట్టినా అవి వేధింపులే

మలయాళం సినిమా ‘ప్రేమమ్’ (Premam) తో ప్రేక్షకులకు చేరువైన నటి సాయి పల్లవి (Sai Pallavi). ‘ఫిదా’ (Fidaa) లో భానుమతి పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కథనాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ అందాల భామ. స్మిత (Smita) హోస్ట్ చేస్తున్న ‘నిజం’ (Nijam) రియాలిటీ షో సాయి పల్లవి తాజాగా పాల్గొంది. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకుంది. స్కూల్ డేస్, రియాలిటీ షోస్‌పై స్పందించింది.

‘‘నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదానిని. డ్యాన్స్ శిక్షణ కోసం క్లాసులకు ఎగ్గొట్టేదానిని. ఒకటో తరగతి చదువుతున్నప్పుడు తొలిసారిగా స్టేజ్‌పై డ్యాన్స్ చేశాను. అప్పట్లో నా జుట్టు చిన్నగా ఉండేది. జుట్టు పొడవుగా కనిపించడం కోసం మా అమ్మ ఓ చున్నీని నా తలకు కట్టింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో అది ఊడిపోయింది. అప్పుడు నాకు బాగా ఇబ్బందిగా అనిపించింది. స్టేజ్ దిగిపోయి బాగా ఏడ్చేశాను. మా అమ్మ కూడా చాలా బాధపడింది. రియాలిటీ షోలు అంటే చాలా భయం. ఆ షోలపై ఆసక్తి ఉండేది కాదు. కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో 16ఏళ్లున్నప్పుడు మొదటిసారిగా ‘ఉంగళిల్ యార్ ప్రభుదేవా’ అనే రియాలిటీ షోలో పాల్గొన్నా. నేను ఈ షోలో తొలి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యాను. అనంతరం 10ఏళ్ల తర్వాత ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటకు అదే సెట్‌లో డ్యాన్స్ చేశా’’ అని సాయిపల్లవి తెలిపింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్‌స్టోరీ’ (Love Story) సినిమా గురించి కూడా మాట్లాడింది. ‘‘వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చేతలతోనే కాదు మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అవి వేధింపులతోనే సమానం. నేను, నా చెల్లి, అమ్మ ఇలా ప్రతి ఒక్కరు వేధింపులను ఎదర్కొన్నారు. నేను వేధింపులకు గురికాని ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ప్రతి ఒక్కరిలో ఈ బాధ ఉంటుంది. ఇంట్లో వాళ్లకు ఏ విధంగా చెప్పాలి..? చెబితే నమ్ముతారా..? అని ఆలోచిస్తారు. అటువంటి వారు నా సినిమా చూపించి ఇలా జరిగింది అని చెప్పొచ్చు’’ అని ఆమె చెప్పింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-10T20:33:24+05:30 IST