Sai Pallavi : ఆ ఫొటోలతో మరోసారి రూమర్స్...
ABN , First Publish Date - 2023-09-21T15:07:24+05:30 IST
లేడీ పవర్‌స్టార్ సాయు పల్లవి పెళ్లి గురించి మరో రూమర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.
లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి పెళ్లి గురించి మరోసారి రూమర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి . దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తేలింది. ఆ ఫొటోలు నటుడు శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌కుమార్ పెరియస్వామి ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మే 9న ‘ఎస్‌కె21’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర బృందంతోపాటు సాయి పల్లవి, దర్శకుడు మెడలో పూల దండలు వేసుకుని ఫొటో దిగారు. ఇప్పుడు ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆమె పెళ్లి అంటూ రూమర్స్ పుట్టించారు. అయితే కొందరు ఆ ఫొటోలు చూసి... సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకున్నవి అవి.. చూస్తే అర్థమవుతోంది కదా? పెళ్లి అని, అల ఎలా రూమర్స్ పుట్టిస్తారు? అని మండిపడుతున్నారు.
ప్రస్తుతం సాయు పల్లవి నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న కథానాయికగా నటించనుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం గురించి సాయి పల్లవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘గీతా ఆర్ట్స్‌లో పని చేయడం, నాగ చైతన్యతో మరోసారి స్పెషల్ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. ఇందులో భాగం చేసి నాకు స్వాగతం పలికిన టీమ్‌కు థ్యాంక్స్. నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులను చాలాకాలంగా మిస్ అవుతున్నా. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా మిమ్మల్ని కలుస్తానని చాలా సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు సాయి పల్లవి.