Sai pallavi: గ్యాప్‌ రాలేదు... నేనే తీసుకున్నా!

ABN , First Publish Date - 2023-05-29T12:43:56+05:30 IST

ఎనిమిది వసంతాలు... 14 సినిమాలు 25 అవార్డులు ్ఞఅసాధారణ క్రేజ్‌ డాన్సింగ్‌ బ్యూటీ యాక్టింగ్‌ వర్సెటాలిటీ యునీక్‌ స్టోరీ సెలక్షన్‌ పాత్రకు తగ్గ నటన ఇది సాయిపల్లవి ట్రాక్‌..

Sai pallavi: గ్యాప్‌ రాలేదు... నేనే తీసుకున్నా!

ఎనిమిది వసంతాలు...

14 సినిమాలు

25 అవార్డులు

్ఞఅసాధారణ క్రేజ్‌

డాన్సింగ్‌ బ్యూటీ

యాక్టింగ్‌ వర్సెటాలిటీ

యునీక్‌ స్టోరీ సెలక్షన్‌

పాత్రకు తగ్గ నటన

ఇది సాయిపల్లవి ట్రాక్‌.. (Sai Pallavi)

ఆమె నటించిన ప్రతి పాత్రకు ది బెస్ట్‌ అనిపించుకుంది. తన యాక్టింగ్‌ వెర్సటాలిటీతో నిజంగానే హైబ్రీడ్‌ పిల్ల (Hybrid Pilla)అనిపించుకుంది. వినోదం అయినా, భావోద్వేగం అయినా హావభావాల్లో క్వీన్‌గా గుర్తింపు పొందింది.

ప్రేమమ్‌లో(Premam) ‘మలర్‌’గా (malar) ఆమెకు వెండితెరకు పరిచయమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఆ పాత్రకు సాయి పల్లవి తెచ్చిన వన్నెతో ఇప్పటికీ మలర్‌ పాత్ర ప్రేక్షకుల మదిలో గుర్తుండి పోయింది. ఈ సినిమా విడుదలై నేటికి 8 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా సాయి పల్లవి అభిమానులు ఆమెను నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. లేడీ పవర్‌స్టార్‌కు సినీ రంగంలో ఎనిమిదేళ్లు అంటూ ఆమె సాధించిన ఘనతను, నటిగా ప్రాణం పోసిన పాత్రలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యారు సాయి పల్లవి (Doctor-Actor). మొదట్లో ఆమెకు నటన ఒక హాబీ మాత్రమే. తర్వాత నటననే కెరీర్‌గా ఎంచుకున్నారు. ఓ పక్క డాక్టర్‌ చదువు, మరో పక్క యాక్టింగ్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నారు. మామూలుగా ఇంటి గెలిచి.. రచ్చ గెలవాలి అంటారు. అయితే సాయి పల్లవి రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలిచింది. తమిళనాడులో జన్మించిన సాయి పల్లవి నటిగా మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో గుర్తింపు పొందింది. అంతకుముందు ‘కస్తూరి మాన్‌’, ‘ధామ్‌ ధూమ్‌’ చిత్రాల్లో నటించిన అవి చిన్న పాత్రలు మాత్రమే. హీరోయిన్‌గా తెరకు పరిచయం అయింది మాత్రం ‘ప్రేమమ్‌’తోనే. మొదట హీరోయిన్‌ కావాలనే ఆలోచన ఆమెకు లేదట. మలయాళ దర్శకుడు అల్పోన్స్‌ పుత్రన్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమమ్‌’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మలర్‌ అనే టీచర్‌ పాత్రలో నటించింది. 2015లో ఆ చిత్రం విడుదలైంది. అందులో మలర్‌ పాత్రతో సాయి పల్లవి ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే!

2.jpg

తదుపరి ఆ చిత్రంతో నటనకు ఫల్‌స్టాప్‌ పెట్టి వైద్య వృత్తిలో స్థిరపడాలని భావించింది. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించారు. డాన్స్‌ అంటే ఆసక్తి ఉండడంతో తల్లి దగ్గరే సాంప్రదాయ నృత్యం నేర్చుకుంది. ‘ఢీ’ తెలుగు వేదికపై తన నాట్య ప్రతిభను చూపడం తన లైఫ్‌ మారిపోయింది. ప్రేమమ్‌’ సాధించిన విజయం, డాన్స్‌ టాలెంట్‌ ఆమెకు తమిళం, తెలుగు భాషల్లో నటిగా అవకాశాలు వచ్చేలా చేశాయి. అలా నటనలో కొనసాగింది. అలాగని వైద్యవృత్తిని పక్కనపెట్టలేదు. ఎగ్జామ్స్‌ రాస్తూ దానిని కొనసాగిస్తున్నారు. నటన పరంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె అంగీకరించలేదు. తనకు నచ్చిన, తను ఏ పాత్రకు నప్పుతుందో ఆ పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్లింది. తెలుగులో శేఖర్‌ కమ్ముల దరకత్వం వహించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగులో మోస్ట్‌ వాంటెట్‌ యాకె్ట్రస్‌గా నిలిచింది. అందులో భానుమతిగా నేచురల్‌ యాక్టింగ్‌గా చెరగని ముద్ర వేసింది. నటనలో నిజంగానే హైబ్రీడ్‌ పిల్ల అనిపించుకుంది. ఇలా తెలుగులో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’, ‘లవ్‌స్టోరీ’, ‘పడిపడి లేచే మనసు’, ‘శ్యామ్‌సింగరాయ్‌’, ‘విరాట పర్వం’ చిత్రాల్లో తన నటన అద్భుతం. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదేమో కానీ నటిగా ఆమె యాక్టింగ్‌ ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. సాయి పల్లవి సినిమాలో ఉందీ అంటే సినిమా చూడొచ్చు అనేంతగా గుర్తింపు పొందింది. 2022లో ఆమె నటించగా విడుదలై గార్గి కూడా చక్కని గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఏడాదిగా ఆమె నుంచి ఒక చిత్రం కూడా రాలేదు. ఎందుకు సినిమాలకు వచ్చింది.. అని ప్రశ్నిస్తే ‘సినిమాల్లో గ్యాప్‌ రాలేదని.. నేను గ్యాప్‌ తీసుకున్నా’’ అని సాయిపల్లవి సమాధానమిచ్చింది. ప్రస్తుతం తమిళంలో కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్నారు సాయి పల్లవి.

3.jpg

Updated Date - 2023-05-29T12:43:56+05:30 IST