Mee too: సాయి పల్లవి ఏమందంటే!

ABN , First Publish Date - 2023-03-09T15:30:02+05:30 IST

మీటూ (#Meetoo) ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే? విదేశాల్లోనూ లైంగిక వేధింపుల గురించి గొంతెత్తారు. బాలీవుడ్‌లో మొదలైన ఈ సమస్య టాలీవుడ్‌ (bollywood to Tollywood) వరకూ చేరింది.

Mee too: సాయి పల్లవి ఏమందంటే!

మీటూ (#Meetoo) ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే? విదేశాల్లోనూ లైంగిక వేధింపుల గురించి గొంతెత్తారు. బాలీవుడ్‌లో మొదలైన ఈ సమస్య టాలీవుడ్‌ (bollywood to Tollywood) వరకూ చేరింది. తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి మాట్లాడారు. పాప్‌ సింగర్‌ స్మిత హోస్ట్‌ చేస్తున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘నిజం’లో (Nijam with Smita) పాల్గొన్నారు సాయి పల్లవి. కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదురుదెబ్బల గురించి మనసు విప్పి మాట్లాడారు. త్వరలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ షో ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Sai palavi)

‘‘ఒకప్పుడు మీటూ ఉద్యమం సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో ఎంతోమంది మహిళలు తాము ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం గురించి మీ ఉద్దేశం ఏమిటి?’’ అన్న స్మిత ప్రశ్నకు ‘‘మీరు శారీరకంగా వేధింపులకు గురి కాకపోవచ్చు. కానీ మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపుతో సమానమే’’ అని సాయి పల్లవి పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌.. ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి డాన్స్‌ చేయాలనుంది’ అని అడగగా ‘‘ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుంది’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. (Want To Dance with Bunny, Ram charan, Ntr)

సెలెక్టివ్‌ సినిమాలు చేస్తున్న సాయిపల్లవి మరోపక్క డాక్టర్‌ చదువుతున్నారు. గత ఏడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సాయిపల్లవి. లైంగిక వేధింపుల నేపథ్యంలో వచ్చిన ‘గార్గి’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే టైటిల్‌ పాత్ర పోషించిన సాయిపల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ రెండు చిత్రాల తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా అప్‌డేట్‌ రాలేదు. ‘పుష్ప -2’ చిత్రంలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - 2023-03-09T15:43:32+05:30 IST