Sai dharam Tej: పెళ్లిపై తేజ్ ఏమన్నాడంటే
ABN , First Publish Date - 2023-07-15T19:52:27+05:30 IST
పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలు పోషించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. శనివారం ఈ చిత్రంలోని రెండో పాటను తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ వేదికగా అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
పవన్‌కల్యాణ్(pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai dharam tej) కీలక పాత్రలు పోషించిన ‘బ్రో’ (Bro) చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. శనివారం ఈ చిత్రంలోని రెండో పాటను తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ వేదికగా అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. అక్కడ కాేసపు సరదాగా అభిమానులతో ముచ్చటించారు చిత్ర బృందం. తేజ్ వేదికపై మాట్లాడుతుండగా ‘‘పెళ్లి ఎప్పుడు?’’ అంటూ ప్రశ్నించారు. దానికి ఆయన ఫన్నీగా జవాబు చెప్పారు. ‘‘ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేేసవారు. కానీ, ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయ్యాక అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారు’’ అంటూ సాయిధరమ్ తేజ్ నవ్వులు పూయించారు.
‘‘మీ అభిమానాన్ని పొందడం కోసమే ఇక్కడికి వచ్చాను. మా గురువు, మావయ్య పవన్‌కల్యాణ్ నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఈ సినిమాలో నేను భాగమయ్యా. ఆయనతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక గొప్ప అనుభవం. దీనిని మాటల్లో వర్ణించలేను’’ అన్నారు. అనంతరం అభిమానులను ఉద్దేశిస్తూ ‘‘దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది. దయచేసి మీరందరూ జాగ్రతగా ఉండండి. ఇందాక వస్తూ రోడ్డు మీద చూశా.. ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని తేజ్ అన్నారు.