Dhimahi: చనిపోయిన వాళ్ళతో మాట్లాడే కాన్సెప్ట్‌తో ‘ధీమహి’.. ట్రైలర్ చూశారా?
ABN , First Publish Date - 2023-10-18T21:41:53+05:30 IST
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. నిఖిత చోప్రా హీరోయిన్. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల (Saahas Pagadala) హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’ (Dhimahi). విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. నిఖిత చోప్రా (Nikhita Chopra) హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 27న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. బుధవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపను కొందరు కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఆ పాప మృతితో ఆ కుటుంబం ఎంత ఆవేదనకు గురైంది. అసలు ఆ పాప చనిపోవడానికి కారణం ఏమిటి? పాపని ఎవరు చంపారు? అనేది తెలుసుకోవడానికి హీరో చేసే సరికొత్త ప్రయత్నమే ‘ధీమహి’ అని తెలుస్తోంది. (Dhimahi Trailer Launched)
ట్రైలర్ విడుదల అనంతరం మేకర్స్ మాట్లాడుతూ.. మా ‘ధీమహి’ చిత్రం ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల అవుతుంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశాం. ట్రైలర్ చాలా బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ రెండు నిమిషాల ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. హీరో సాహస్ పగడాల కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకు 7:11PM చిత్రంతో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ను, ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. కాన్సెప్ట్, విజువల్స్ మరియు సినిమాటోగ్రఫీ బాగుందంటూ అంతా కామెంట్ చేస్తున్నారు. నెక్రోమాన్సీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించాం. నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఈ చిత్రంలో పొందుపరిచాం. సినిమా అంతా ఫారిన్‌లోనే షూట్ చేశాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, మంచి థ్రిల్లింగ్ అంశాలతో.. సరికొత్త కథ, కథనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలమని అన్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..
********************************
*VK Naresh: చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం
**********************************
*Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!
**********************************
*Leo: వేకువజామున 4గంటల ఆటకు హైకోర్టు నో.. కారణమిదే!
**************************************