Naatu Naatu: ఆస్కార్‌కు అడ్డు ఆ పాటలే!
ABN , First Publish Date - 2023-03-12T21:03:06+05:30 IST
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకకు సర్వం సిద్ధం అయింది. ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) అకాడమీ అవార్డ్ కోసం పోటీపడుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో బరిలో నిలిచింది.
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకకు సర్వం సిద్ధం అయింది. ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) అకాడమీ అవార్డ్ కోసం పోటీపడుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో బరిలో నిలిచింది. ఈ విభాగంలో మొత్తంగా ఐదు పాటలు పోటీపడుతున్నాయి. ‘నాటు నాటు’ తో పాటు అప్లాజ్ సినిమా నుంచి 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్', టాప్ గన్ మావెరిక్ చిత్రం నంచి 'హోల్డ్ మై హ్యాండ్', 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' మూవీ నుంచి 'లిఫ్ట్ మీ అప్', ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్ నుంచి 'దిస్ ఈజ్ ఎ లైఫ్' పాటలు పోటీలో నిలిచాయి. అయితే, సినీ ప్రపంచంలోనే విశిష్టంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ‘నాటు నాటు’ కు, 'లిఫ్ట్ మీ అప్', ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటల నుంచి గట్టి పోటీ ఎదురవగా పురస్కారం మాత్రం మన పాటనే వరించింది.
‘నాటు నాటు’ కు కీరవాణి సంగీతం అందించారు. లిరిక్స్‌ను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ప్రపంచం మొత్తం మెస్మరైజ్ అయింది. నెటిజన్స్ కూడా రీల్స్, వీడియోస్ చేసి సందడి చేశారు. కొరియన్ ఎంబసీ కూడా అదరగొట్టే స్టెప్పులను వేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తంగా 81 పాటలు పోటీపడ్డాయి. ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్ అయ్యాయి. అందులో ‘నాటు నాటు’ తో పాటు మరో నాలుగు సాంగ్స్ మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు
Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..
Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!
Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు
Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్