Rajamouli -RRR : రాజమౌళి తగ్గేదేలే.. ఒకే వేదికపై ఐదు అవార్డులు!

ABN , First Publish Date - 2023-02-25T11:07:12+05:30 IST

‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్‌ మహాన్‌’’ (Hollywood Critics Association awards ceremony) ని అంతర్జాతీయ వేదికపై గొంతెత్తి చెప్పారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

Rajamouli -RRR :  రాజమౌళి తగ్గేదేలే.. ఒకే వేదికపై ఐదు అవార్డులు!

‘‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్‌ మహాన్‌’’ (Rajamaolu -Mera bharat mahan)అని అంతర్జాతీయ వేదికపై గొంతెత్తి చెప్పారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.(S.S.Rajamouli) అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ‘ఆస్కార్‌’కి (oscar)అడుగు దూరంలో ఉన్న ఈ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ (golden globe awards) వరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆరవ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (Hollywood Critics Association awards ceremony)నుంచి ఐదు విబాగాల్లో అవార్డులు అందుకొంది. తాజాగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ అవార్డు వేడుకల్లో బెస్ట్‌ యాక్షన్‌, బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ సాంగ్‌తోపాటు స్పాట్‌ లైట్‌ అవార్డును కూడా అందుకున్నారు రాజమౌళి అండ్‌ టీమ్‌. రాజమౌళి, రామ్‌చరణ్‌ తదితరులు ఈ వేడుకలో భాగమయ్యారు. ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ కేటగీరీలో ఏరియల్‌ కంబాట్‌ ఫిల్మ్‌ ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘బ్యాట్‌ మ్యాన్‌’, ‘విమెన్‌ కింగ్‌’ ఉన్నప్పటికీ ఆ సినిమాలను పక్కకు నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ అవార్డు సొంతం చేసుకుంది. (Best International Film, Best Action Film, Best Stunts and Best Original Song awards)

4.jpg2.jpg

‘బెస్ట్‌ స్టంట్స్‌’కు అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (Rajamouli speech) మాట్లాడుతూ ‘’ఆర్‌ఆర్‌ఆర్‌లో స్టంట్స్‌ గుర్తించి అవార్డు ఇచ్చిన ‘హెచ్‌.సి.ఎ’కు కృతజ్ఞతలు. నేను ముందుగా మా యాక్షన్‌ కొరియోగ్రాఫర్లకు థాంక్స్‌. ఈ సినిమాలో ప్రతి స్టంట్స్‌ కంపోజ్‌ చేయడానికి సాల్మన్‌ చాలా ఎఫర్ట్స్‌ పెట్టారు.. క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్‌ చేశారు. ఇతర స్టంట్‌ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి మా విజన్‌, వర్కింగ్‌ స్టైల్‌ అర్థం చేసుకుని పని చేశారు. హీరోలిద్దరూ వండర్‌ఫుల్‌. రెండు మూడు షాట్స్‌ లో మాత్రమే బాడీ డబుల్‌ ఉపయోగించాం. మిగతా యాక్షన్‌ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు’’ అని అన్నారు. ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ అవార్డు అందుకున్న అనంతరం గాల్లో విహరిస్తునట్లు ఉందని జక్కన్న చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్‌ కొరియోగ్రాఫర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (RRR At HCA awards)

3.jpg1.jpg

Updated Date - 2023-02-25T13:39:30+05:30 IST