RRR Controversy: ‘నాటు నాటు’కి భాస్కర్ అవార్డు కూడా రాదు.. సింగర్‌పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఫైర్..
ABN , First Publish Date - 2023-03-17T12:57:40+05:30 IST
ఆస్కార్ అవార్డుతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్ మొత్తం సంతోషంలో తేలియాడుతోంది.
ఆస్కార్ అవార్డుతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్ మొత్తం సంతోషంలో తేలియాడుతోంది. ముఖ్యంగా ఆస్కార్ స్టేజ్‌పై లైవ్ ఫర్ఫామెన్స్ ఇవ్వడంతో సింగర్స్ కాలభైరవ (Kaala Bhairava), రాహుల్ సిప్లిగంజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ తరుణంలో ఆ సంతోషాన్ని పంచుకుంటూ కాల భైరవ చేసిన పోస్ట్‌తో ఓ వివాదానికి తెరతీసింది.
కాల భైరవ షేర్ చేసిన పోస్టులో.. ‘‘మీతో ఓ విషయం పంచుకోవాలని అనుకుంటున్నా. ఆస్కార్స్ స్టేజ్‌పైన ఆర్ఆర్ఆర్ టీమ్‌ని రిప్రజెంట్ చేస్తూ బెస్ట్ ఓరిజినల్ సాంగైన ‘నాటు నాటు’ లైవ్ ఫర్ఫామెన్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది వల్లే ఇది సాధ్యమైంది. నాకు ఈ అవకాశం వచ్చేందుకు కారణమైన రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మకి ధన్యవాదాలు. వారి కష్టం వల్లే ఈ పాట ప్రపంచంలోని నలుమూలలకి చేరింది. వారి వల్లే నాకు ఇలాంటి గొప్ప అవకాశం వచ్చింది’ అని రాసుకొచ్చాడు.
అయితే.. అందులో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) పేర్లు మాత్రం కాలభైరవ చెప్పలేదు. ఇది ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. దీంతో.. ‘ఆ హీరోలు కనుక మంచిగా డ్యాన్స్ చేయకపోతే.. ఎవరూ ఆ పాటని చూసేవారే కాదు’.. ‘సంగీతంపరంగా కొమ్మ ఊయ్యల, దోస్తి ఈ పాటకంటే బావుంటాయి. కానీ.. డ్యాన్స్ వల్లే ఈ పాట ఆ స్థాయికి చేరింది. అది గుర్తు లేదా’.. ‘హీరోలు లేకపోతే నాటు నాటుకి భాస్కర్ అవార్డు కూడా రాదు’ అని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో తారక్, చెర్రీకి, వారి ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతూ కాలభైరవ ఓ పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..
Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’
#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్
OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ
Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..
అందులో.. ‘‘నాటు నాటు’, ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌కి తారక్ అన్న, చరణ్ అన్న ముఖ్యకారణం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. నాకు ఆస్కార్ స్టేజ్‌పై ఫర్ఫామెన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేసిన వారి గురించి మాత్రమే చెప్పుకొచ్చాను అంతే. అందులో మరేం లేదు. అది అందరికీ తప్పుగా అర్థమైంది. నా పదాల ఎంపికకి అందరిని క్షమాపణలు కోరుతున్నా’ అని రాసుకొచ్చాడు. దీంతో వివాదం సద్దుమణిగినట్లైంది.