RRR- Rajamouli: జపాన్‌ ఫ్యాన్స్‌ ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేశారు!

ABN , First Publish Date - 2023-01-28T16:45:52+05:30 IST

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రోజుకో రికార్డ్‌ సృష్టిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్‌ నామినేషన్స్‌లో కూడా ఉంది. గత ఏడాది అక్టోబర్‌ 21 ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే!

RRR- Rajamouli: జపాన్‌ ఫ్యాన్స్‌ ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేశారు!

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)రోజుకో రికార్డ్‌ సృష్టిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్‌ నామినేషన్స్‌లో కూడా ఉంది. గత ఏడాది అక్టోబర్‌ 21 ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే! ఆ దేశంలో అత్యధిక సెంటర్లలో వందరోజులు పూర్తి చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సత్తా చాటింది. దీనిపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘జపాన్‌లో 114 కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుంటోన్న తొలి భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని ఉన్న పోస్టర్‌ని ఆయన షేర్‌ చేశారు. (RRR completes 100 days in japan)

‘‘గడచిన రోజుల్లో ఒక సినిమా 100 రోజులు 175 రోజులు లేదా అంతకుమించి ఆడితే చాలా పెద్ద విషయంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అవేమీ లేదు. వాటిని మంచి జ్ఞాపకాలుగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు జపాన్‌లోని సినీ ప్రియులు మాకు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేశారు. మేము తిరిగి ఆ ఆనందాన్ని పొందేలా చేశారు. లవ్‌ యూ జపాన్‌, థ్యాంక్యూ’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకొంది. ఇటీవల ఈ చిత్రం గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకుంది. అలాగు నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

Updated Date - 2023-01-28T16:49:04+05:30 IST