Biggboss 7 : మాయాస్త్ర ఆట.. బుర్ర లేదు, బుద్థి లేదు, రెస్పెక్ట్ లేదంటూ ఫైర్
ABN , First Publish Date - 2023-09-15T14:29:20+05:30 IST
ప్రస్తుతం ‘బిగ్‌బాస్ 7’లో (Biggboss7) ఉన్నవారంతా కంటెస్టెంట్స్ మాత్రమే! హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందాలంటే ‘బిగ్‌బాస్’ ఇచ్చిన టాస్క్‌ల్లో గెలవాలి. అప్పుడే ఇంటి సభ్యులు అవుతారని ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్‌బాస్ సెలవిచ్చారు. ప్రస్తుతం ఉన్న 14 మందిలో ఆట సందీప్ (Aata sandeep) హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందాడు.
ప్రస్తుతం ‘బిగ్‌బాస్ 7’లో (Biggboss7) ఉన్నవారంతా కంటెస్టెంట్స్ మాత్రమే! హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందాలంటే ‘బిగ్‌బాస్’ ఇచ్చిన టాస్క్‌ల్లో గెలవాలి. అప్పుడే ఇంటి సభ్యులు అవుతారని ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్‌బాస్ సెలవిచ్చారు. ప్రస్తుతం ఉన్న 14 మందిలో ఆట సందీప్ (Aata sandeep) హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందాడు. మిగతావారు హౌస్‌మేట్స్ కావడానికి కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో మాయాస్త్ర టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌లో ఎవరెవరు ఏం చేశారు.. ఎలా సాగుతోందో చూద్దాం. (Power Astra Game)
మయా అస్త్రలో శుభశ్రీ ఎలాంటి అస్త్రను గెలవలేకపోయింది. దాంతో సందీప్ దగ్గరున్న దగ్గరున్న పవర్ అస్త్రను కొట్టేసింది. పోనీ.. అదైనా జాగ్రత్తగా దాచిందా అంటే అదీ లేదు. కిచెన్‌లో దాయడం, అప్పటికే సందీప్ మాస్టర్ సహా పలువురు దానికోసం వెతకడం, అమర్‌దీప్ దాన్ని వెతికి మాస్టర్ చేతికివ్వడం జరిగిపోయింది. దీంతో శుభశ్రీ దొరకిపోయింది. దాంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. దాంతో బిత్తరముఖం వేసుకుంది. తెల్లారిన తర్వాత బిగ్‌బాస్ మాయాస్త్ర టాస్క్‌ను తిరిగి కొనసాగించారు. ఈ మాయాస్త్ర ద్వారా నాలుగు వారాల ఇమ్యునిటీతోపాటు ఈ వారం కూడా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. మహాబలి టీం సభ్యులు రణధీర సమూహంలో ఎవరైతే పవరాస్త్ర పొందేందుకు అనర్హులో కారణం చెప్పి వారి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని అదే గ్రూప్‌లోని మరో సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. చివర్లో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ మాయాస్త్ర భాగాలు ఉంటే వారు పవరాస్త్ర కోసం పోటీ పడతారు. మొదటగా శుభశ్రీ వెళ్లి.. శోభాశెట్టి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ అమర్ దగ్గరునర అస్తను తీసి శివాజీకి ఇచ్చాడు.
అప్పుడే మొదలైంది అసలు రచ్చ. తర్వాత రతిక వెళాలని మహాబలి టీం ఫిక్స్ చేసింది. లేదు, నేను చివర్లోనే వెళ్తానని తెగేసి చెప్పింది రతిక. అలా కాదు నేనే చివర్లో వెళ్తానని టేస్టీ తేజ, గౌతమ్‌లు వాదించారు. తనకు ఎంత సర్ది చెప్పాలని చూసినా వినిపించుకోలేదు. శివాజీని గెలిపించాలని మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిన రతిక అందుకోసం తన టీమ్‌మేట్స్ మీద అరిచి గోల చేసింది. దామినితో అయితే మాట్లడితే పోట్లాటకు దిగింది. మనకంటే ఆ టీమ్ బెస్ట్ అని రతిక అనడంతో ఆ టీమ్‌లోకే వెళ్లు అని చెప్పింది దామిని. ఆ టీమ్‌లోకి వెళ్లు, ఈ టీమ్‌లోకి వెళ్లు అని హిత బోధ చేయడానికి నువ్వు ఎవరు అంటూ విరుచుకుపడింది రతిక. వీక్షకులు నీ వైపు దృష్టి పెట్టాలనే కదా రెచ్చిపోతున్నావ్ అంది దామిని. కాసేపటికి బాధను కంట్రోల్ చేసుకోలేక ఆ అమ్మాయికి బుర్ర లేదు, బుద్థి లేదు, రెస్పెక్ట్ లేదు.. ప్రతీది టీఆర్పీ కోసమే చేస్తుంది అని ఏడ్చేసింది. అయితే ఈ సిచ్చుయేషన్‌లో రతిక మాత్రం వెనక్కి తగ్గలేదు. చివర్లోనే వెళ్తానని డిసైడ్ అయింది. ఈ సమస్యను తేల్చేందుకు మూడో స్థానంలో ఎవరు వెళ్లాలని ఓటింగ్ పెట్టారు. అందరూ రతిక వెళాలని చేతులు ఎత్తారు. దీంతో కోపగించిన ఆమె ఛీ ఛీ వీళ్లంతా జోకర్స్‌లా ఉన్నారు, ఈ టీమ్‌లో ఉండటానికే చిరాగ్గా ఉంది. వీళ్లంతా బఫూన్స్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడింది.
సంచాలక్‌గా వ్యవహరించిన సందీప్ ‘రెండు రోజులుగా ఆ టీమ్‌లో ఉన్నావ్.. ఇప్పుడు వాళ్లను బఫూన్స్ అంటున్నావ్.. కరెక్ట్ కాదు అని చెప్పాడు. రతిక అయినా వినలేదు. వాళ్ల ప్రవర్తన అలా ఉంది. ఏమనాలి మరి? అని తిరగబడింది. జరుగుతున్నది అంతా గమనించిన సంచాలక్ మూడో స్థ్థానంలో రతికను రమ్మని ఆదేశించాడు. తను రానని సూటిగా చెప్పేసింది. దాంతో సందీప్ కోపంతో ఊగిపోయాడు.
ఇదంతా కూర్చుని గమనించి షకీల రేయ్, ఆమె కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.. ఇవ్వనివ్వండి అని అనుభవంతో చెప్పింది. గొడవ పెరుగుతుంది కానీ ఆట ముందుకు సాగడం లేదని దామిని మూడోస్థానంలో వెళ్లింది. ప్రియాంక దగ్గరున్న మాయాస్త్రను షకీలాకు ఇచ్చింది. నాలుగో స్థానంలో వెళ్లమని చెప్పినా వినలేదు రతిక. దాంతో బిగ్‌బాస్ కలగజేసుకుని మహాబలి టీమ్‌కు సరిపడ సమయం ఇచ్చినా టాస్క్ పూర్తి చేయనందున ఎవరు నాలుగు, ఐదారు స్థానాల్లో వెళ్లాలో రణధీర టీమ్ నిర్ణయించాలని మెలిక పెట్టాడు. అంతేకాదు, అప్పటివరకు మాయాస్త్ర భాగాలను కలిగిన వారికి మాత్రమే మిగిలిన భాగాలు ఇవ్వాలని నిబంధన పెట్టాడు. మాయాస్త్ర భాగాలు కోల్పోయిన అమర్, ప్రియాంక, శోభాశెట్టి ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మూడు రోజుల ఆట కష్టమంతా పోయుందని బాధపడ్డారు. రతిక వల్ల సీరియల్ టీమ్ ఆటలో లేకుండా పోయింది.