Rashmika Mandanna : నేనే కాదు.. నాలాగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు!
ABN , First Publish Date - 2023-11-06T16:01:17+05:30 IST
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను అభిమానించేవాళ్లు, సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఏ విషయం అయినా అతివేగంగా జనాల్లోకి వెళ్లిపోతుంది. తాజాగా రష్మికకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు (Rashmika Mandanna) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను అభిమానించేవాళ్లు, సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఏ విషయం అయినా అతివేగంగా జనాల్లోకి వెళ్లిపోతుంది. తాజాగా రష్మికకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. మార్ఫింగ్ (Deep fake video) వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని తెలిపింది. ఆ వీడియో వైరల్ అవ్వడం పట్ల తాజాగా రష్మిక కూడా స్పందించింది.
"ఇలాంటి ఫేక్ వీడియోలో నన్ను భాగం చేసి వైరల్ చేయడం చాలా బాధ అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఇలాంటి భయంకర సంఘటనలు నాకే కాదు ఎంతో మందికి జరుగుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఇలాంటి వాటికి ఉపయోగించడం బాధాకరం. నాకే కాదు ఎంతోమందిని ఇలాంటి ఫేక్ వీడియోలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రోజు, ఒక మహిళగా నటిగా నాకు సపోర్ట్ సిస్టంగా నిలిచి మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇలాంటి ఘటనే స్కూల్, కాలేజ్‌లో ఉన్న సమయంలో ఎదురైతే నేను దీనిని ఎలా పరిష్కరించగలనో కూడా ఊహించలేకుండా ఉన్నాను. ఇలాంటి పనులకు పాల్పడే వారి వల్ల మరింత మంది ప్రభావితం కాకుండా ఇబ్బందులు పడకుండా వారిపై చర్యలు తీసుకోవాలి, అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలి’’ అని రష్మిక సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అంతే కాదు.. సైబరాబాద్ పోలీస్‌లకు, మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్‌లకు ట్యాగ్ చేసింది.
ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. డీప్ బ్యాక్‌నెక్ ధరించిన జారా పటేల్ అనే యువతి వీడియోను రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు. అది చూసిన నెటిజన్లు అలా చేయడం నేరమని రష్మికు మద్దతుగా నిలిచారు. అయితే ఆ వీడియోకు సంబందించిన ఒరిజినల్‌ను ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని.. రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రష్మిక మార్ఫింగ్ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్ పౌరులకు భద్రత కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వీడియోపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రష్మిక మందన్నా.. రణ్‌బీర్ సరసన నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘పుష్ప-2’లోనూ నటిస్తోంది.