Rashmika Mandanna: ఆ డైరెక్టర్‌తో ముచ్చటగా మూడోసారి!
ABN , First Publish Date - 2023-01-13T15:42:56+05:30 IST
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్యనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్యనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ (Pushpa) లో నటించింది. ఈ భామ నితిన్ (Nithiin) తో రెండో సారి జత కట్టనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం అందుతుంది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు కథను వినిపించగా అంగీకారం తెలిపిందట. వెంకీ కుడుములనే రష్మికను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఛలో ప్రాజెక్టుకు వీరిద్దరూ కలసి పని చేశారు. అనంతరం భీష్మలో కూడా రష్మికకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా మూడో సారి కలసి పనిచేయబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల గతంలో మెగాస్టార్ చిరంజీవికీ ఓ కథను వినిపించాడు. కొంత కాలం స్క్రిఫ్ట్‌పై పనిచేశాడు. ఏమైందో తెలియదు కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. తాజాగా నితిన్‌కు స్టోరీని వినిపించగా అతడు ఓకే చేశాడు. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం.