Rashmika Mandanna: కోరుకుంది.. ముందే ఊహించింది.. అప్పుడే చెప్పింది!

ABN , First Publish Date - 2023-08-27T14:01:54+05:30 IST

‘పుష్ప’ సినిమా సక్సెస్‌ మీట్‌లో రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్‌ మీట్‌లో నేషనల్‌ అవార్డు గురించి రష్మిక చెప్పింది.

Rashmika Mandanna: కోరుకుంది.. ముందే ఊహించింది.. అప్పుడే చెప్పింది!

తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ దక్కని రికార్డును పుష్ప(Pushpa) సినిమాతో అర్జున్‌ దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీచ పురస్కారం దక్కించుకుని చరిత్ర సృష్టించారు. అర్జున్‌కు అవార్డు దక్కడంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులతోపాటు చిత్రం దర్శకుడు సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నా(Rashmika mandanna ఈ చిత్రంతో నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందింది. ‘పుష్ప’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్‌ మీట్‌లో నేషనల్‌ అవార్డు గురించి రష్మిక చెప్పింది. (national best actor)

Untitled-2.jpg

‘‘పుష్ప’గారికి ఈసారి నేషనల్‌ అవార్డే కాదు.. ప్రతీ అవార్డు తప్పకుండా వస్తుంది. రాకపోతే మొదట హర్ట్‌ అయ్యేది నేనే’. స్ర్కీన్‌ మీద ఆయన చేసిన నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుపోయింది. కేవలం మేకప్‌ కోసమే ఆయనకు ప్రతిరోజు సుమారు 3గంటల సమయం పట్టేది. ఆ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది’’ అని ఆ రోజు రష్మిక పేర్కొంది. ఇప్పుడు అదే నిజం కావడంతో అప్పటి మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రష్మిక ఈ విషయాన్ని ముందే గ్రహించిందని ఫ్యాన్స్‌ నెటిజన్లు చెబుతున్నారు.

2.jpg

Updated Date - 2023-08-27T15:44:36+05:30 IST