Rashmika Mandanna: నా మనసులో ఉన్నది అతడే!

ABN , First Publish Date - 2023-08-03T12:46:52+05:30 IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌లో ఉందని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ స్పందించినా ఆ గాసిప్‌లు మాత్రం ఆగలేదు. ‘గీత గోవిందం’ చిత్రం నుంచి ఈ జంటకు పెరిగిన క్రేజ్‌ అలాంటివి. తాజాగా రష్మిక మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పింది.

Rashmika Mandanna: నా మనసులో ఉన్నది అతడే!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) విజయ్‌ దేవరకొండతో (Vijay devarakonda) డేటింగ్‌లో ఉందని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ స్పందించినా ఆ గాసిప్‌లు మాత్రం ఆగలేదు. ‘గీత గోవిందం’ చిత్రం నుంచి ఈ జంటకు పెరిగిన క్రేజ్‌ అలాంటివి. తాజాగా రష్మిక మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పింది. దాంతో మరోసారి అందరూ విజయ్‌ అనే అనుకున్నారు. ఇటీవల ఓ ప్రమోషన్‌కి వెళ్లిన రష్మికను హోస్ట్‌ తనకు ఇష్టమైన వ్యక్తి, పెళ్లి గురించి ప్రస్తావించగా ‘నరుటోతో నా పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు’ అని రష్మిక సమాధానం ఇచ్చింది. ‘నరుటో’ (naruto)అనేది ఫేమస్‌ అయిన ఎనిమీ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. ఈ సిరీస్‌కు అందులోని పాత్రలకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంటుంది. అందులో రష్మిక కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’(pushpa2) సినిమాతో బిజీగా ఉంది రష్మిక. దీనితోపాటు సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’తోపాటు ‘రెయిన్‌ బో’ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేస్తోంది.

Updated Date - 2023-08-03T12:57:35+05:30 IST