Rashmika Mandanna: అది చాలా కష్టమైన పాత్ర.. ఆలా మొదటిసారి చేశా
ABN , First Publish Date - 2023-08-12T17:16:13+05:30 IST
నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా(Rashmika mandanna) వరుస చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లోనూ అగ్రతారల సరసన అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అక్కడ ‘యానిమల్’, ‘రెయిన్ బో’ చిత్రాలు చేస్తున్న ఆమె తెలుగులో ‘పుష్ప-2’తో బిజీగా ఉంది.
నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా(Rashmika mandanna) వరుస చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లోనూ అగ్రతారల సరసన అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అక్కడ ‘యానిమల్’, ‘రెయిన్ బో’ చిత్రాలు చేస్తున్న ఆమె తెలుగులో ‘పుష్ప-2’(Pushpa 2) తో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు డిసెంబర్ నెల అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ
‘‘నాకు డిసెంబర్ నెల అంటే చాలా ఇష్టం. సెంటిమెంట్ కూడా. నాకు అదృష్టమైన నెలగా భావిస్తా. నా తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ ఆ నెలలోనే విడుదలై సూపర్ హిట్టైంది. అంతేకాదు.. తర్వాత నటించిన నాలుగు చిత్రాలు అదే నెలలో విడుదలై సక్సెస్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘పుష్ప’ 17, డిసెంబర్ 2021లో విడుదలైంది. అందుకే ఈ నెలంటే నాకు అంతగా ప్రత్యేకం. తాజా చిత్రం ‘యానిమల్’(Animal) కూడా ఆ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సినిమాలో నాది ఎంతో కష్టమైన పాత్ర. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కానుంది’’ అని తెలిపారు.
‘పుష్ప-2’తోపాటు హిందీల రెయిన్ బో చిత్రంలో నటిస్తోంఇ రష్మిక. లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది. రొమాంటిక్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో దేవ్ మోహన్ నటించనున్నాడు. శాంత రూబన్ దర్శకుడు.