Deverakondas: చిన్న కొండ తోపు, దమ్ముంటే ఆపు అని అరుస్తుంటే, రష్మిక ముసిముసి నవ్వులు

ABN , First Publish Date - 2023-05-17T11:49:34+05:30 IST

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్యలో ఎదో జరుగుతోంది అని అప్పుడు, ఇప్పుడు వైరల్ అవుతూనే వుంది. ఈ నేపథ్యంలో రష్మిక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమాలోంచి ఒక పాట విడుదల చెయ్యడానికి వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే...

Deverakondas: చిన్న కొండ తోపు, దమ్ముంటే ఆపు అని అరుస్తుంటే, రష్మిక ముసిముసి నవ్వులు

విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda) నటించిన 'బేబీ' (Baby) సినిమా సాంగ్ లాంచ్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా? రష్మిక మందన్న (RashmikaMandanna). ఈ సినిమాకి సాయి రాజేష్ (SaiRajesh) దర్శకుడు కాగా, ఎస్ కె ఎన్ (SKN) నిర్మాత. ఆమె ఈ ఫంక్షన్ కి వచ్చి ఈ సాంగ్ లాంచ్ చేసింది. వచ్చిన అభిమానులు అందరూ 'చిన్న కొండ తోపు, దమ్ముంటే ఆపు' అని అరుస్తూనే వున్నారు. దానికి ఆనంద్ దేవరకొండ "నేను ఏమి పీకలేదురా లైఫ్ లో ఎందుకరుస్తున్నారు?" అని వాళ్ళని అడిగాడు. వచ్చిన అభిమానులు ఆలా అరుస్తుంటే రష్మిక మందన్న ముసిముసిగా నవ్వుకుంటోంది.

rashmika-konda.jpg

ఆనంద్ దేవరకొండ, రష్మిక మందన్న ని ఏమని పిలుస్తాడా తెలుసా? 'రషి' అంటాడుట. నేను అలానే పిలుస్తాను అని చెప్పాడు. చాలా కాలం నుండి తెలుసుకదా అని చెప్పాడు. "ఎప్పటినుంచో పరిచయం కాబట్టి నేను రషి రషి అని పిలుస్తా," అని చెప్పాడు ఆనంద్.

ఇప్పుడు ప్రేమ పాటలకు రష్మిక మందన్న ఒక పోస్టర్ లా అయిపొయింది అని చెప్పాడు ఆనంద్ దేవరకొండ. అక్కడకి వచ్చిన అభిమానులకి రష్మిక పాటలు ఏవి బాగున్నాయో అడిగాడు. అయితే ఆనంద్ దేవరకొండ ఫేవరెట్ సాంగ్ ఎదో తెలుసా. నా ఫేవరెట్ 'నీ నీలి కన్నుల్లో ఆకాశమే... అన్న పాట తనకి ఇష్టం అని చెప్పాడు. అయితే ఇది ఇందులోదో తెలుసునా, తన అన్న విజయ్ దేవరుకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాలోది. ఆనంద్ దేవరకొండ స్పీచ్ ఇస్తున్నంత సేపూ రష్మిక నవ్వుతూనే వుంది.

rashmika-konda1.jpg

అలాగే అభిమానులు అన్న ఎక్కడ అన్న ఎక్కడ అని అడుగుతున్నప్పుడు అయితే రష్మిక మొహం మరింత వెలిగిపోయింది. అన్న రాజమండ్రి లో వున్నాడు అని చెప్పాడు ఆనంద్.

Updated Date - 2023-05-17T11:49:34+05:30 IST