Rana Daggubati: రానా భార్య మిహీకా నిజం చెప్పేసింది
ABN , First Publish Date - 2023-05-08T17:00:47+05:30 IST
రానా భార్య మిహీక స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవానికి అతిధిగా వచ్చి, అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ తన గురించి, రానా గురించి మాట్లాడింది.
రానా దగ్గుబాటి (RanaDaggubati), భార్య మిహీక (Miheeka) కొన్ని రోజుల నుండి వార్తల్లో వున్నారు. రానా భార్య మిహీక ప్రేగ్నంట్ (Pregnant) అని, రానా త్వరలో తండ్రి కాబోతున్నాడు అని వార్తలు వైరల్ అయ్యాయి. దానితో అది నిజమే అనుకున్నారు, ఎందుకంటే దగ్గుబాటి కుటుంబం నుండి ఎవరూ ఆ విషయాన్ని ఖండించలేదు. ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే, రానా ఒకసారి తన భార్య బహుమతి ఇస్తుందని చెప్పటం, ఇలా ఈ వార్త వైరల్ అయింది.
అయితే ఈ వార్తలు అన్నిటినీ రానా భార్య మిహీకా స్పందిస్తూ అవన్నీ కేవలం వదంతులు మాత్రమే అని అన్నారు. ఆమె స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభానికి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ నేపధ్యం లో మీడియా వాళ్ళతో మాట్లాడారు. అందులో భాగం గానీ ఇవన్నీ వాడతులని చెప్పారు. "నేను ప్రెగ్నంట్ కాదు. ఈమధ్య నేను కొంచెం బరువు పెరిగానని, అందుకని అందరూ ఆలా అనుకొని ఉండవచ్చు," అని చెప్పారు. రానా మీ దగ్గర నుండి ఒక సర్ ప్రైజ్ వస్తుందని చెప్పాడని, అది ఏంటో చెప్పగలరా అని అడిగితే ఆ సర్ ప్రైజ్ కానుక ఏంటో తనకి కూడా తెలియదని, రానానే అడగాలని చెప్పింది, ఒక ప్రశ్నకి సమాధానముగా.
తాను ఎప్పుడూ స్క్రీన్ మీదకి కనిపించనని, వెనకాల ఉండటమే ఇష్టం అని చెప్పుకొచ్చారు. సినిమాలు చూసి ఆనందించటమే ఇష్టం అని చెప్పింది. అలాగే ఎక్కువగా రానా నటించిన సినిమాలలో తాను జోక్యం చేసుకోనని చెప్పింది, తనకు వాటి మీద అవగాహనా లేదని చెప్పింది. అలాగే తన మెంటల్ హెల్త్ ప్రాజెక్ట్ మీద దృష్టి ఎక్కువ పెట్టానని, సినిమాల మీద కాదని చెప్పింది. రానా, మిహీక ల వివాహం 2020 లో జరిగింది.