Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

ABN , First Publish Date - 2023-03-03T18:40:05+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో రానా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా తన స్నేహితుడితో జరిగిన ఆసక్తికర సంభాషణను ప్రేక్షకులకు తెలిపారు.

కొన్నేళ్ల క్రితం ముంబైకు చెందిన ఓ స్నేహితుడితో జరిగిన సంభాషణను తాజాగా రానా నెటిజన్స్‌తో పంచుకున్నారు. ‘‘నేను ‘బాహుబలి’ (Baahubali) షూటింగ్ చేస్తున్నప్పుడు ముంబైలో ఓ స్నేహితుడిని కలుసుకున్నాను. ‘బాహుబలి’ గురించి వివరించాను. ఆ మిత్రుడు.. హీరో ఎవరని అడిగాడు..? ప్రభాస్ అని చెప్పాను. ప్రభాస్ (Prabhas) ఎవరు..? నాకు తెలియదు అన్నారు. అప్పుడు రెబల్ స్టార్ నటించిన కొన్నిచిత్రాలు చెప్పాను. ఆయన ప్రభాస్ నటించిన ఒక్క మూవీ కూడా చూడలేదు. అప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నాకు చిన్ను భర్త మాత్రమే హీరోగా తెలుసు అని చెప్పారు. చిన్ను ఎవరు అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాసేపటికి చిన్ను అంటే నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) అని నాకు అర్థమైంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ను ఈ విధంగా గుర్తుంచుకోవడం నాకు షాకింగ్‌గా అనిపించింది. నాలుగైదు ఏళ్లు వేచి ఉండు. మా ఆర్మీ అంతా బాలీవుడ్‌లో ల్యాండ్ అవుతుందని చెప్పాను. కొన్నేళ్ల క్రితం టాప్ సౌత్ స్టార్స్ గురించి కూడా ఎవరికి తెలియదు. దక్షిణాది చిత్రాలను ఎవరు పట్టించుకునే వారు కాదు’’ అని రానా దగ్గుబాటి తాజాగా వివరించారు. ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల మధ్య హద్దులను చెరిపేసిన ఘనత ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli)కి దక్కుతుందన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ తో విదేశాల్లోను సత్తా చాటన్నారు.

‘రానా నాయుడు’ లో వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్రలు పోషించారు. తండ్రి, కొడుకులుగా నటించారు. అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-03-03T19:10:20+05:30 IST