Ram Pothineni : ఆయన వస్తున్నారంటే.. సిగ్గుతో పారిపోవాలనుకున్నా!
ABN , First Publish Date - 2023-09-25T15:02:25+05:30 IST
‘స్కంద’ సినిమాతో తన ఎనర్జీని చూపించడానికి సిద్ధమయ్యారు రామ్ పోతినేని. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘స్కంద’ సినిమాతో తన ఎనర్జీని చూపించడానికి సిద్ధమయ్యారు రామ్ పోతినేని. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. షారుక్‌ఖాన్‌ను ఇటీవల కలిసినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘‘అట్లీ దంపతులు నాకు మంచి స్నేహితులు వాళ్లే నన్ను షారుక్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇందుకు వాళ్లకు కృతజ్ఞతలు. షారుక్ చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలిసినప్పుడు నాతో ఎంతో మర్యాదగా వ్యవహరించారు. నా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరం సినిమాల గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆయన ‘స్కంద’ ట్రైలర్ పంపమని అడిగారు’’ అని రామ్ అన్నారు.
అలాగే తాను కలిసిన మొదటి బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ అని రామ్ చెప్పారు. ‘‘నేను చేసిన ‘రెడీ’ సినిమాను సల్మాన్ హిందీలో రిమేక్ చేశారు. నాకు జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ కూడా మంచి ఫ్రెండ్స్. మేమంతా ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో అక్కడకు సల్మాన్ వస్తున్నారని రితేశ్ చెప్పారు. నాకు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం బిడియం ఎక్కువ. దీంతో సెట్ నుంచి వెళ్లిపోతానని చెప్పా. రితేశ్ నన్ను ఆపి సల్మాన్ రాగానే ఆయనకు పరిచయం చేశారు. నన్ను చూడగానే ‘గుర్తున్నావు. రెడీలో బాగా చేశావు’ అని సల్మాన్ అన్నారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది’’ అని రామ్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.