Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ
ABN , First Publish Date - 2023-03-14T13:01:36+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట అవార్డు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట అవార్డు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుకలు ఇప్పటికి 95 సార్లు జరిగాయి. ఇన్నేళ్ల ఆస్కార్ చరిత్రలో ఏసియా నుంచి ‘నాటు నాటు’కి మాత్రమే ఈ అవార్డు దక్కడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ‘నాటు నాటు’ ఆస్కార్ రావడంపై రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. (Oscars95)
ఆ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్‌కి అవార్డు వచ్చిన రాకపోయిన ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే.. దాని రేంజ్ ఏంటో ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. ఇంకో విషయం.. ఈ సినిమాకి అవార్డు ఇవ్వకపోతే.. అది ఆస్కార్ వాళ్ల దురదృష్టం అయ్యేది. నిజం చెప్పాలంటే.. కీరవాణి పాటల్లో ‘నాటు నాటు’ కాకుండా నాకు నచ్చిన 50 సాంగ్స్ ఉన్నాయి. కానీ ఏది ఎవరికీ ఎందుకు నచ్చుతుందో మనం చెప్పలేం’ అని చెప్పుకొచ్చాడు. (Oscars95)
అలాగే వర్మ ఇంకా మాట్లాడుతూ.. ‘అవార్డు కోసం అక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టారని.. టాలీవుడ్‌తో పాటు బాంబేలో పలువురు విమర్శలు చేస్తున్నారు. పబ్లిసిటీకి కోసం ఖర్చు పెట్టడం సాధారణంగా జరిగేదే. దాని గురించి మాట్లాడడం చాలా సిల్లీ విషయం అవుతుంది. బుర్ర తక్కువ వాళ్లే అలా మాట్లాడతారు. అలాగే.. డబ్బులు ఖర్చు పెడితే అవార్డు వచ్చేది నిజమైతే.. హాలీవుడ్ వాళ్లు ఖర్చు పెట్టలేరా. అవెంజర్స్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను సంవత్సరానికి చాలా సినిమాలు హాలీవుడ్‌లో తీస్తారు కదా. వారికి లాబీయింగ్ చేయడం అంత కష్టమా.
రాజమౌళి వల్ల తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. టాలీవుడ్ చిత్రాలకి అంతర్జాతీయ స్థాయిలో రెవెన్యూ వస్తుంది. దీనికోసం రూ.80 కోట్లు కాదు.. రూ. 1000 కోట్లు పెట్టిన తక్కువే’ అని తనదైన శైలిలో స్పందించాడు. (Oscars95)
అలాగే.. ఆ ఇంటర్వ్యూలో అవార్డుల కోసం ఎందుకు ప్రయత్నించలేదని యాంకర్ ఆర్జీవీని అడిగింది. దానికి జవాబు చెబుతూ.. ‘నాకు అవార్డుల మీద అంత నమ్మకం లేదు. సినిమాకి సంబంధించిన కొంతమంది కూర్చుని వాటిని డిసైడ్ చేస్తారు. వేరే వ్యక్తి ఒపీనియన్‌కి నేను విలువ ఇవ్వను. అందుకే వాటికి విలువ ఇవ్వను’ అని తెలియజేశాడు.
ఇవి కూడా చదవండి:
Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..
SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..
Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు
NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..
Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..