#RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు హాజరవుతున్న రామ్ చరణ్ లుక్ వైరల్
ABN , First Publish Date - 2023-01-03T11:51:47+05:30 IST
#RRR సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌలి (SS Rajamouli) ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో రూపొందిన కల్పిత పీరియాడిక్ సినిమా #RRR. అంతర్జాతీయంగా ఈ సినిమా కి ప్రశంసలు వచ్చాయి, అలాగే ఈ చిత్రం అవార్డులను కొన్నిటిని సొంతం చేసుకుంది. అదే క్రమంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద 'నాటు నాటు సాంగ్..' అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. (Natu Natu song from #RRR is nominated in #GoldenGlobeAwards)
#RRR సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' సినిమా బ్లాక్ బస్టర్ సాధించి 2022లో చరణ్‌కు మంచి మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవటమే కాకుండా.. 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి రామ్ చరణ్, (#RamCharan) ఎస్.ఎస్.రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌తో (#JrNTR) కలిసి లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కానున్నారు. (Ram Charan, who is attending for #GoldenGlobeAwards function, look is going viral)
RRR లోగో ఉన్న బ్లాక్ కలర్ రాయల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను కూడా రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రతి ఏడాది ఎంతో ప్రెస్టీజియస్‌గా జరిగే ఆస్కార్ అవార్డులకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను కర్టన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి RRR ఎంపికైన ఇదే అవార్డుల కేటగిరిలను మార్చిలో జరగబోయే అకాడమీ అవార్డ్స్‌లోనూ గెలుచుకుంటుందని అందుకు ఇది ఓ హింట్ అని అనుకోవచ్చు.