Ram charan counter: ఆయన సౌమ్యుడేమో... మేం కాదు!
ABN , First Publish Date - 2023-01-29T16:29:09+05:30 IST
‘‘నాన్న చాలా సౌమ్యమైన వ్యక్తి అని అందరూ అంటుంటారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈరోజున ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆయన కొంచెం బిగించి.. కాస్త గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఇతరులకు తెలియదు.
‘‘నాన్న (Chiranjeevi)చాలా సౌమ్యమైన వ్యక్తి అని అందరూ అంటుంటారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే ఈరోజున ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆయన కొంచెం బిగించి.. కాస్త గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఇతరులకు తెలియదు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే.. ఆయన మౌనంగా ఉంటారేమో కానీ, ఆయన వెనకున్న మేము మౌనంగా ఉండం. సౌమ్యంగా ఉండమని సౌమ్యంగానే చెబుతున్నాం’’ అని రామ్‌చరణ్ (Ram charan)అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (waltar veerayya success meet) సక్సెస్ వేడుక శనివారం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో చిరంజీవిని విమర్శిస్తున్న వారికి రామ్‌చరణ్ కౌంటర్ ఇచ్చారు. నాన్నగారు సౌమ్యంగా ఉంటారేమో కానీ.. మేం ఆయనలా సౌమ్యంగా ఉండలేం. ఆ విషయాన్ని సౌమ్యంగానే చెబుతున్నాం’’ అని అన్నారు. ఇటీవల వైసీపీ మంత్రి రోజా చిరంజీవి, ఆయన సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లకు ప్రతి స్పందనగా చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఇంకా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ‘‘మైత్రీ మూవీస్ సంస్థ నాకు ‘రంగస్థలం’ లాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చింది. ఇప్పుడు నాన్నకు ‘వాల్తేరు వీరయ్య’లాంటి మర్చిపోలేని విజయాన్ని అందించింది. బాబీ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా చూపించారు. మా నాన్న నాకు తమ్ముడిలా కనిపించారు. ఏ ముహూర్తాన పూనకాలు లోడింగ్ అని పెట్టారో కానీ.. వసూళ్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. రవితేజతో ఓ సీరియస్ పాత్ర చేయించి.. దాన్ని కూడా మేము ఎంజాయ్ చేేసలా చేశారు బాబీ. సినిమా పూర్తయ్యాక కూడా రవితేజని ఇంకా చూడాలనిపించి నెట్‌ఫ్లిక్స్‌లో ధమాకా సినిమా చూశా. అతని ఎనర్జీని చూడటం అద్భుతం. దేవిశ్రీ నాన్నగారికి 150వ సినిమాను నుంచి అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. నాక్కూడా అలాంటి ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు.