Ram Charan: నాన్న ఓ అడుగు ముందే ఉంటారు!
ABN , First Publish Date - 2023-03-12T20:42:18+05:30 IST
సినీ ప్రియులు ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుక మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఏ మాధ్యమం చూసినా ‘ఆస్కార్’ గురించే టాపిక్.
సినీ ప్రియులు ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుక మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఏ మాధ్యమం చూసినా ‘ఆస్కార్’ గురించే టాపిక్. అందుకు కారణం లేకపోలేదు. భారత్ నుంచి తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR)లోని ‘నాటు నాటు’(Natu natu) పాట నామినేట్ కావడం. యావత్ దేశమంతా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో పాటకు ఆస్కార్ వరించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్ టీమంతా అమెరికాలో సందడి చేస్తోంది. అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అమెరికాలోని మెగా ఫ్యాన్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్‌కు మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. రామ్ చరణ్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పి.. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడకు వచ్చిన అభిమానుల్లో కొందరు ‘మెగాస్టార్‌కు చిరంజీవికి భక్తులు ఉంటారు’ అని కేరింతలు పెట్టడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతోదూరం నుంచి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Ram charan about Chiranjeevi)
‘‘ఇండియాలో ఓ ప్రాంతం నుంచి మరొ ప్రాంతానికి వెళ్లడం సులభం. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికాలో ఓ సినిమాకు వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది నాకోసం చాలా దూరం నుంచి ఇంతమంది వచ్చారు. మీ అందరి ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే! అందుకే మిమ్మల్ని, మీ అభిమానాన్ని ఎప్పుడూ నా గుండెల్లో పెట్టుకుంటున్నాను. మీరు చూపిస్తున్న అభిమానంతో మరింత ఎనర్జీ పెరుగుతుంది. మీకోసం ఇంకేదో చేయాలనే తపన పెరుగుతుంది. మేం ఈ స్టేజ్‌లో ఉన్నామంటే మీ అందరి అభిమానమే కారణం. తెలుగు వాళ్లుగా మనం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR Creates history) చరిత్ర సృష్టించబోతున్నాం. అందులో మీరంతా భాగస్వాములే. దీని విలువ ఈ రోజు తెలియకపోవచ్చు. కానీ రానున్న 10 ఏళ్ల తర్వాత వెనకకు తిరిగి చూేస్త ఈ రోజు గురించి గర్వంగా మాట్లాడుకుంటాం. ఈ ట్రిప్‌ను ఎప్పటికీ మరచిపోలేను’’ అని అన్నారు. Daddy advance in Tecjnology said Ram charan)
చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అయిన సందర్భంగా నాన్న గారు అమెరికాలో ఉన్న అభిమానులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. అది చూసి నేను అవాక్కయ్యాను. ఆయనకు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనుకున్నాను. మాకన్నా ఆయన అప్‌డేట్‌గా ఉంటారు. ఆయన మాకంటే అన్నిటిలో ఓ అడుగుముందే ఉంటారు’’ అని రామ్ చరణ్ అన్నారు.
పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ అభినందనలు తెలిపారు. విరాళాలు ేసకరించి మంచి పనులకు ఉపయోగిస్తున్నారని.. సేవ చేయడం కోసం వేర్వేరు డ్రైవ్‌లను నిర్వహిస్తున్నందుకు అభిమాన సంఘాలకు కృతజ్ఞతలు చెప్పారు.